Sep 21 2022సెప్టెంబర్ 21 2022favorite_border

" కాలం - అనుకూలం " 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 సెప్టెంబర్ 21 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం వర్ష ఋతువు  
భాద్రపదమాసం కృష్ణపక్షము 

తిథి : ఏకాదశి రాత్రి 10గం౹౹20ని౹౹ వరకు తదుపరి ద్వాదశి(22) గురువారం రాత్రి 12గం౹౹13ని౹౹ వరకు
వారం :సౌమ్యవారం (బుధవారం)
నక్షత్రం : పుష్యమి ఈ రోజు రాత్రి 11గం౹౹52ని౹౹ తదుపరి  ఆశ్లేష
యోగం :  పరిఘ ఈ రోజు ఉదయం 09గం౹౹13ని౹౹ వరకు తదుపరి శివ
కరణం :  బవ ఈ రోజు ఉదయం 10గం౹౹32ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి  01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 11గం౹౹31ని౹౹ నుండి 12గం౹౹19ని౹౹ వరకు 
వర్జ్యం : ఉదయం 06గం౹౹10ని౹౹ నుండి 07గం౹౹57ని౹౹ వరకు
అమృతకాలం :  సాయంత్రం 04గం౹౹47ని౹౹ నుండి 06గం౹౹33ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹52ని౹౹ 
సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹56ని౹౹

 ఏకాదశీ ఉపవాసము బుధవారం ఉండాలి. ద్వాదశీ పారణము (భోజన ప్రసాదం) గురువారం ఉదయం చేయాలి.


గురుబోధ

పితృదేవతలు -7  గణములు  - వీరి నామముల స్మరణ వలన సకల పాపాలు, పితృదోషాలు తొలగుతాయి.  వంశం వృద్ధి చెందుతుంది.  శ్రాద్ధ సమయంలో తప్పక వీరిని స్మరించాలని శాస్త్రం.
1. వైరాజుడు 2. అగ్నిష్వాత్తుడు  3. బర్హిషదుడు 4. సుకాలుడు 5. అంగిరసుడు  6.సుస్వధుడు  7.   సోమపుడు 

- శ్రీ హరివంశ పురాణము (పితృకల్పం)


expand_less