Sep 20 2022సెప్టెంబర్ 20 2022favorite_border

" కాలం - అనుకూలం " 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 సెప్టెంబర్ 20 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం వర్ష ఋతువు  
భాద్రపదమాసం కృష్ణపక్షము 

తిథి : దశమి రాత్రి 08గం౹౹21ని౹౹ వరకు తదుపరి ఏకాదశి
వారం : భౌమవారం (మంగళవారం)
నక్షత్రం : పునర్వసు ఈ రోజు రాత్రి 09గం౹౹20ని౹౹ తదుపరి  పుష్యమి
యోగం :  వరీయాన్ ఈ రోజు ఉదయం 08గం౹౹25ని౹౹ వరకు తదుపరి పరిఘ
కరణం : వణిజ ఈ రోజు ఉదయం 08గం౹౹15ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి  04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 08గం౹౹18ని౹౹ నుండి 09గం౹౹06ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹42ని౹౹ నుండి 11గం౹౹30ని౹౹ వరకు
వర్జ్యం : ఉదయం 08గం౹౹01ని౹౹ నుండి 09గం౹౹47ని౹౹ వరకు
అమృతకాలం :  సాయంత్రం 06గం౹౹40ని౹౹ నుండి 08గం౹౹26ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹52ని౹౹ 
సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹56ని౹౹

గురుబోధ

దేవతాపూజలు, పితృకార్యాలు వంటివి చేసేటప్పుడు ఎంతో శ్రద్ధాభక్తులతో చేయాలి. వాటితో  పాటు సరైన విద్య (ధర్మశాస్త్ర అవగాహన) తెలిసి ఉండాలి. అప్పుడే సంపూర్ణ ఫలితం ఇస్తుంది అందుకే పురాణములు, ధర్మశాస్త్రములు పెద్దల ద్వారా తెలుసుకోవాలి. 

ఉదా౹౹ భీష్ముడు తన తండ్రి శంతనుడికి శ్రాద్ధ కార్యక్రమం చేస్తున్నప్పుడు పిండమును స్వయంగా శంతనుడే చెయ్యి చాపి తన చేతిలో పెట్టు, నేను స్వయంగా స్వీకరిస్తాను అంటాడు. కానీ ధర్మశాస్త్ర ప్రకారం పిండము చనిపోయిన తల్లితండ్రులకు కాదు, పితృదేవతలకు. అందుకే వాటిని దర్భల పైనే ఉంచి, శంతనుడి మాటను తిరస్కరిస్తాడు. తన ధర్మనిరతి కి సంతోషించిన పితృదేవతలు ప్రత్యక్షమై భీష్ముడిని ఆశీర్వదిస్తారు.  అదే శంతనుడికి పిండము ఇచ్చి ఉంటే పితృదేవతల ఆగ్రహానికి గురి అయ్యేవాడు.


expand_less