" కాలం - అనుకూలం " ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 సెప్టెంబర్ 17 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపదమాసం కృష్ణపక్షము తిథి : సప్తమి మధ్యాహ్నం 02గం౹౹41ని౹౹ వరకు తదుపరి అష్టమి వారం : స్థిరవారం (శనివారం) నక్షత్రం : రోహిణి ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹01ని౹౹ తదుపరి మృగశిర యోగం : సిద్ధి ఈ రోజు పూర్తిగా ఉంది కరణం : బవ ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹14ని౹౹ వరకు తదుపరి బాలవ రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉదయం 06గం౹౹34ని౹౹ నుండి 07గం౹౹28ని౹౹ వరకు వర్జ్యం : ఉదయం 05గం౹౹56ని౹౹ నుండి 07గం౹౹07ని౹౹ వరకు & రాత్రి 08గం౹౹08ని౹౹ నుండి 09గం౹౹53ని౹౹ వరకు అమృతకాలం : ఉదయం 10గం౹౹34ని౹౹ నుండి 12గం౹౹17ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹52ని౹౹ సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹02ని౹౹ 👉🏻🕉️కన్యా సంక్రమణం విశ్వకర్మ జయంతి 🕉️ గురుబోధ పంచకదళీ దానం కదళీ(అరటి) - పితృదేవతల ప్రీత్యర్థం స్వయంపాకం ఇచ్చేప్పుడు పంచకదళీ అంటే అరటి ఆకు, అరటి కాయ, అరటి పండు, అరటి పువ్వు, అరటి దూట ను ఇవ్వడం లేదా వీటిని పితృ కార్యక్రమంలో వంటకు వినియోగించడం చాలా మంచిది.