Sep 14 2022సెప్టెంబర్ 14 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 సెప్టెంబర్ 14 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం వర్ష ఋతువు  
భాద్రపదమాసం కృష్ణపక్షము 

తిథి : చతుర్థి  మధ్యాహ్నం 12గం౹౹19ని౹౹ వరకు తదుపరి పంచమి
వారం : సౌమ్యవారం (బుధవారం)
నక్షత్రం : అశ్విని ఈ రోజు ఉదయం 09గం౹౹52ని౹౹ తదుపరి భరణి
యోగం :  ధ్రువ ఈ రోజు ఉదయం 06గం౹౹18ని౹౹ తదుపరి వ్యాఘాత
కరణం : బాలవ ఈ రోజు ఉదయం 10గం౹౹25ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి  01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 11గం౹౹32ని౹౹ నుండి 12గం౹౹21ని౹౹ వరకు 
వర్జ్యం : ఉదయం 05గం౹౹48ని౹౹ నుండి 07గం౹౹25ని౹౹ వరకు & రాత్రి 07గం౹౹50ని౹౹ నుండి 09గం౹౹29ని౹౹ వరకు
అమృతకాలం :  లేదు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹51ని౹౹ 
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹01ని౹౹

యమభరణి (మహాభరణి)

గురుబోధ

పితృకార్యక్రమాలు జరుగుతున్నప్పుడు తెలిసీ తెలియక ఏవైనా పొరపాటులు జరిగినా దోషం రాకుండా ఉండడానికి,  పితృకార్యక్రమం అక్షయఫలితం ఇవ్వడానికి ,పితృదేవతల సంతృప్తి కొరకు తప్పక పితృస్తవమును పారాయణము (మార్కండేయ పురాణం లోని స్తోత్రం) చేయాలి.  పితృపక్షాలలో వచ్చే భరణి నక్షత్రాన్ని యమభరణి అంటారు. ఆ రోజు జరిగే పితృపూజ గొప్ప ఫలితం ఇస్తుంది. ఇది యమునికి అత్యంత ప్రీతికరం.

expand_less