"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబర్ 11 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు
భాద్రపదమాసం కృష్ణపక్షము
తిథి : పాడ్యమి మధ్యాహ్నం 02గం౹౹23ని౹౹ వరకు తదుపరి విదియ
వారం : భానువారం(ఆదివారం)
నక్షత్రం : పూర్వాభాద్ర ఈ రోజు ఉదయం 10గం౹౹02ని౹౹ తదుపరి ఉత్తరాభాద్ర
యోగం : శూల ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ తదుపరి గండ
కరణం : కౌలవ ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹14ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సాయంత్రం 04గం౹౹28ని౹౹ నుండి 05గం౹౹17ని౹౹ వరకు
వర్జ్యం : రాత్రి 07గం౹౹26ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
అమృతకాలం : తెల్లవారి 03గం౹౹02ని౹౹ నుండి 04గం౹౹50ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹50ని౹౹
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹04ని౹౹
👉🏻🕉️మహాలయపక్షాలు ప్రారంభం🕉️
గురుబోధ
మహాలయపక్షాలలో ( భాద్రపద కృష్ణపక్ష పాడ్యమి నుండి అమావాస్య ) పితృదేవతల ప్రీత్యర్థం తప్పక పితృకార్యక్రమాల గురించి వినడం, తెలుసుకోవడం చేయాలి. ఉదా౹౹ గరుడపురాణం, మార్కండేయ పురాణము మొ౹౹ వాటిలో పితృ కార్యక్రమాలు, పితృదేవతల చరిత్ర ఉంటాయి. ఆ పురాణములను వినడం, పితృదేవతా స్తోత్రం, యమకృత శివకేశవ నామములు మొ౹౹ పారాయణము చేయడం చేయాలి.