Sep 10 2022సెప్టెంబర్ 10 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 సెప్టెంబర్ 10 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం వర్ష ఋతువు  
భాద్రపదమాసం శుక్లపక్షము 

తిథి : పూర్ణిమ  మధ్యాహ్నం 02గం౹౹56ని౹౹ వరకు తదుపరి పాడ్యమి
వారం : స్థిరవారం(శనివారం)
నక్షత్రం : శతభిషం ఈ రోజు ఉదయం 10గం౹౹56ని౹౹ తదుపరి పూర్వాభాద్ర
యోగం :  ధృతి ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹55ని౹౹ తదుపరి  శూల 
కరణం : బవ ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹28ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి మ. 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 06గం౹౹34ని౹౹ నుండి 07గం౹౹28ని౹౹ వరకు 
వర్జ్యం : సాయంత్రం 05గం౹౹05ని౹౹ నుండి 06గం౹౹37ని౹౹ వరకు 
అమృతకాలం :  రాత్రి 02గం౹౹20ని౹౹ నుండి 03గం౹౹52ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 05గం౹౹50ని౹౹ 
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹05ని౹౹

👉🏻🕉️ఉమామహేశ్వర వ్రతం

గురుబోధ

పండుగలు జరుపుకుంటే దేవతలు ఆ కుటుంబానికి ఆశీర్వాదం అందచేస్తారు. కుదరని పక్షంలో పండుగలు చేయకపోయినా పెద్దదోషం కలుగదు. కానీ శ్రాద్ధ దినములు, పితృపక్షంలో తగిన విధంగా పితృదేవతలను సంతృప్తి పరచకపోతే వారికి తప్పక అశుభఫలితాలు కలుగతాయని శాస్త్రం. అందుకే ఎట్టి పరిస్థితుల్లో పితృదేవతా కార్యక్రమాలు విడిచిపెట్టకూడదు.

expand_less