నవరాత్రి చిత్రకళాలేఖన పోటీలు
చిత్రలేఖనం, ఇది ఒక అద్భుతమైన కళా నైపుణ్యం, ఏ కళలో నైపుణ్యం పొందాలన్నా ఆ అమ్మవారి కరుణ ఉండాల్సిందే,చిత్రలేఖనం అనే ఒక అద్భుతమైన కళ ద్వారా మనము ఒక రూపాన్ని ఎంతో సృజనాత్మకతో మన మనసులోని భావాన్ని ఒక చిత్రం ద్వారా బయట పెట్టవచ్చు. మీ మనసులో ఉన్న అమ్మ రూపాన్ని ఎంతో ప్రేమగా, భక్తి తో ఈ చిత్రలేఖనం పోటీల ద్వారా వ్యక్తపరిచాలనుకునే వారందరికీ ఇదొక సువర్ణ అవకాశం, మీ అందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం
పోటీలు
విభాగాలు
1వ విభాగము. 6 నుండి 16 సం|| : బాలాత్రిపుర సుందరీ/సింహంతో ఉన్న అమ్మవారు
2వ విభాగము. 17 నుండి 30 సం|| : దుర్గాదేవి/ లక్ష్మీదేవి.
3వ విభాగము. 31వ సం|| నుండి పైబడిన వారు : లలితా దేవీ/ సరస్వతీ దేవి.
నియమాలు:
-> అభ్యర్థి తన వయో విభాగం నుండి ఇవ్వబడిన అంశాలను మాత్రమే ఎంచుకోవాలి
-> మీ వయోవిభాగంలో ఇవ్వబడ్డ అంశాలకు సంబంధించి మీరు సమర్పించినవి మాత్రమే స్వీకరించబడుతుంది. అన్య వయో విభాగం నుండి మరియు ఇతర అంశాల నుండి మీరు సమర్పించే చిత్రాలు తిరస్కరించబడతాయి.
-> చిత్రాన్ని ఏ పరిమాణం లో అయినా, ఏ మాధ్యమం లో అయిన చిత్రించవచ్చు. హస్త చిత్రకళ వంటి వినూత్నమైన చిత్రకళల చిత్రాలు కూడా స్వీకరించబడతాయి.
-> చిత్రకళ పై ఆసక్తి గురుభక్తి కలిగిన వారందరూ అర్హులే.
-> పోటీలో పాల్గొనటానికి ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు.
-> ఒక అభ్యర్థి ఒక్క చిత్రాన్ని మాత్రమే సమర్పించాలి, ఒకటికి మించి సమర్పిస్తే అభ్యర్థిని అనర్హులు గా ప్రకటిస్తారు.
-> నిపుణుల బృందం అభ్యర్ధుల చిత్రాలను సమగ్రంగా పరిశీలించి న్యాయనిర్ణయం చేస్తారు.
-> విజేతల ప్రకటన పూర్తిగా న్యాయమూర్తుల నిర్ణయం, ఇతరుల ప్రమేయం, ప్రభావం ఉండదు.
-> ఇవ్వబడిన గడువులోపు మాత్రమే అభ్యర్థి సమర్పించాలి. గడువు పూర్తి అయిన తర్వాత సమర్పించే చిత్రాలు పోటీ గణనలోకి తీసుకొనబడవు.
అభ్యర్థి గీసిన చిత్రాన్ని మొత్తం మూడు దశలలో చిత్రాలు సమర్పించాలి
మొదటి దశ:
మీరు చిత్రాన్ని వేస్తున్నప్పుడు, సగం పూర్తి అయిన చిత్రం పై తేదీ, నెల, సంవత్సరం రాయాలి (ఉదాహరణ:13-07-2022) , ఆలా తేది రాశాక సగం పూర్తి అయిన చిత్రం తో మీరు ఫోటో (సెల్ఫీ)తీసుకొని ఇవ్వబడిన వెబ్సైట్ లింక్ లో సమర్పించాలి.
రెండవ దశ:
పూర్తి చేసిన మీ చిత్రం తో సెల్ఫీ తీసుకొని,ఆ ఫోటో ని ఇవ్వబడిన వెబ్సైటు లింక్ ద్వారా సమర్పించాలి.
మూడవ దశ
పూర్తి అయిన మీ చిత్రాన్ని మాత్రమే ఫోటో తీసి సమర్పించాలి.
పైన చెప్పిన విధంగా 3 దశల చిత్రాలను సమర్పించవలిసి ఉంటుంది. ఏ దశలో అయిన అసంపూర్ణముగా వదిలేస్తే మీ అభ్యర్థిత్త్వాన్ని తిరస్కరించటం జరుగుతుంది.
Form closed. ఫారమ్ మూసివేయబడింది.