August 27 2022ఆగస్ట్ 27 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఆగస్ట్ 27 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం వర్ష ఋతువు  
శ్రావణమాసం కృష్ణపక్షము 

తిథి : అమావాస్య ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹05ని౹౹ వరకు తదుపరి పాడ్యమి
వారం : స్థిరవారం (శనివారం)
నక్షత్రం : మఘ ఈ రోజు రాత్రి 09గం౹౹01ని౹౹ వరకు తదుపరి పుబ్బ 
యోగం : శివ ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం : నాగవాన్ మధ్యాహ్నం 01గం౹౹46ని౹౹ వరకు తదుపరి కింస్తుఘ్న
రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం :  ఉదయం 06గం౹౹38ని౹౹ నుండి 07గం౹౹28ని౹౹ వరకు 
వర్జ్యం : ఉదయం 08గం౹౹03ని౹౹ నుండి 09గం౹౹46ని౹౹ వరకు 
అమృతకాలం :  సాయంత్రం 06గం౹౹25ని౹౹ నుండి 08గం౹౹08ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹48ని 
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹15ని

👉🏻🕉️ అమావాస్య, పోలాల అమావాస్య వ్రతం, శ్రావణ శనివారం🕉️

గురుబోధ

శనివారం  అమవాస్య వస్తే అది పద్మకయోగం. పద్మకయోగము ఉన్నరోజు చేసే ఏ పుణ్యకార్యమైనా అక్షయ  ఫలితం ఇస్తుంది.  కనుక ఈ రోజు నవగ్రహ ఆలయ సందర్శన,  నవగ్రహ  ప్రదక్షిణలు, శని భగవంతునికి తైలాభిషేకం, సిందూరంతో అర్చన, నవగ్రహస్త్రోత్ర పారాయణలు చేయడం వలన విశేష ఫలితం ఉంటుంది అని శివపురాణం చెబుతుంది.

expand_less