August 24 2022ఆగస్ట్ 24 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఆగస్ట్ 24 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం వర్ష ఋతువు  
శ్రావణమాసం కృష్ణపక్షము 

తిథి : ద్వాదశి ఈ రోజు ఉదయం 07గం౹౹54ని౹౹ వరకు తదుపరి త్రయోదశి
వారం : సౌమ్యవారం (బుధవారం)
నక్షత్రం : పునర్వసు ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹16ని౹౹ వరకు తదుపరి పుష్యమి 
యోగం : వ్యతీపాత ఈ రోజు రాత్రి 01గం౹౹25ని౹౹ వరకు తదుపరి వరీయాన్
కరణం : తైతుల ఉదయం 08గం౹౹30ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం :  ఉదయం 11గం౹౹38ని౹౹ నుండి 12గం౹౹28ని౹౹ వరకు
వర్జ్యం : రాత్రి 11గం౹౹06ని౹౹ నుండి 12గం౹౹52ని౹౹ వరకు 
అమృతకాలం : ఉదయం 11గం౹౹36ని౹౹ నుండి 01గం౹౹22ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹47ని 
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹18ని

గురుబోధ
నైమిశారణ్య క్షేత్రం లో అష్టాదశ పురాణములను, శాస్త్రాలను 88,000 మంది ఋషులు సత్రయాగం చేస్తూ విన్నారు. గోమతీ నదము, చక్ర తీర్థం, లింగ ధారిణి అమ్మవారి శక్తిపీఠం మొ౹౹ ఎన్నో దివ్యప్రదేశాలు ఇక్కడ ఉంటాయి. ఇటువంటి పుణ్యప్రదేశాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలి.


శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి ఆలయం, బెంగళూరు లో బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి *శ్రీ మద్ భాగవత సప్తాహ ప్రవచనం ఆగష్టు 21 నుండి 27 వరకు జరుగుతున్నది. శ్రీకృష్ణస్వరూపమైన భాగవతం వినండి, తరించండి.


expand_less