"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగస్ట్ 01 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు
శ్రావణమాసం శుక్లపక్షము
తిథి : చతుర్థి రాత్రి 02గం౹౹40ని౹౹ వరకు తదుపరి పంచమి
వారం : ఇందువారము (సోమవారం)
నక్షత్రం : పుబ్బ మధ్యాహ్నం 02గం౹౹56ని౹౹ ఉంది తదుపరి ఉత్తర
యోగం : పరిఘ ఈ రోజు రాత్రి 07గం౹౹04ని౹౹ వరకు తదుపరి శివ
కరణం : వణిజ ఉదయం 04గం౹౹48ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹32ని౹౹ నుండి 01గం౹౹23ని౹౹ వరకు & మధ్యాహ్నం 03గం౹౹06ని౹౹ నుండి 03గం౹౹57ని౹౹ వరకు
వర్జ్యం : రాత్రి 10గం౹౹23ని౹౹ నుండి 12గం౹౹02ని౹౹ వరకు
అమృతకాలం : ఉదయం 08గం౹౹06ని౹౹ నుండి 09గం౹౹47ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹42ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹30ని
👉🏻🕉️లక్ష్మీ జయంతి, దూర్వాగణపతి వ్రతం, నాగ చతుర్థి🕉️
గురుబోధ
లక్ష్మీదేవి లోక కళ్యాణార్థం ఎన్నో సార్లు అవతరించింది. అందులో ఒకానొక అవతారము శ్రావణమాసం ఉత్తరఫల్గునీ నక్షత్రం లో జరిగింది. అందుకే ఈ పుణ్యదినమును లక్ష్మీజయంతి గా జరుపుకుంటారు.