"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూలై 30 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు
శ్రావణమాసం శుక్లపక్షము
తిథి : విదియ రాత్రి 01గం౹౹17ని౹౹ వరకు తదుపరి తదియ
వారం : స్థిరవారము (శనివారం)
నక్షత్రం : ఆశ్లేష ఉదయం 11గం౹౹45ని౹౹ ఉంది తదుపరి మఘ
యోగం : వ్యాతీపాత ఈ రోజు సాయంత్రం 07గం౹౹02ని౹౹ వరకు తదుపరి వరీయాన్
కరణం : బాలవ మధ్యాహ్నం 02గం౹౹13ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : ఈ రోజు ఉదయం 9గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 06గం౹౹34ని౹౹ నుండి 07గం౹౹22ని౹౹ వరకు
వర్జ్యం : రాత్రి 12గం౹౹39ని౹౹ నుండి 02గం౹౹22ని౹౹ వరకు
అమృతకాలం : ఉదయం 10గం౹౹00ని౹౹ నుండి 11గం౹౹44ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹41ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹31ని
◆ శ్రావణ శనివారం
గురుబోధ
ముహూర్తం కోసం ఇద్దరు ముగ్గురు పండితులను సంప్రదించడం, పెట్టిన ముహూర్తాన్ని విమర్శించడం చేయరాదు. దాని వలన చెడు ఫలితాలు వస్తాయి. శాస్త్ర పాండిత్యం ఉన్న ఒక్కరిని నమ్మి ముహూర్తం మొదలయినవి పెట్టుకోవాలని శాస్త్రము.