"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూలై 01 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం శుక్లపక్షం
తిథి : విదియ ఈ రోజు ఉదయం 10గం౹౹41ని౹౹ వరకు తదుపరి తదియ
వారం : భృగువారము (శుక్రవారం)
నక్షత్రం : పుష్యమి రాత్రి 02గం౹౹12ని౹౹ వరకు తదుపరి ఆశ్లేష
యోగం : వ్యాఘాత ఈ రోజు ఉదయం 10గం౹౹47ని౹౹ వరకు తదుపరి హర్షణ
కరణం : కౌలవ మధ్యాహ్నం 01గం౹౹09ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹08ని౹౹ నుండి 09గం౹౹01ని౹౹వరకు & మధ్యాహ్నం 12గం౹౹30ని౹౹ నుండి 01గం౹౹22ని౹౹ వరకు
వర్జ్యం : ఈ రోజు ఉదయం 08గం౹౹33ని౹౹ నుండి10గం౹౹19ని౹౹ వరకు
అమృతకాలం : ఈ రోజు రాత్రి 07గం౹౹08ని౹౹ నుండి 08గం౹౹52ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹32ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹34ని౹I
👉🏻🕉️ పురీ జగన్నాథ స్వామి రథయాత్ర🕉️ ఆషాఢ శుక్రవారం-లక్ష్మీపూజ
గురుబోధ
ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియ, సప్తమోక్ష క్షేత్రాలలో ఒకటైన శ్రీ పురీజగన్నాథస్వామి వారికి రథోత్సవం వైభవముగా జరుగుతుంది. ఈ రథోత్సవం లో పాల్గొన్నా, దర్శించినా పునర్జన్మ ఉండదని పురాణములు చెపుతున్నాయి.