"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జూన్ 29 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షము తిథి : అమావాస్య ఈ రోజు ఉదయం 06గం౹౹42ని౹౹ వరకు తదుపరి పాడ్యమి వారం : సౌమ్యవారము (బుధవారం) నక్షత్రం : ఆరుద్ర ఈ రోజు రాత్రి 09గం౹౹07ని౹౹ వరకు తదుపరి పునర్వసు యోగం : వృద్ధి ఈ రోజు ఉదయం 08గం౹౹42ని౹౹ వరకు తదుపరి ధ్రువ కరణం : నాగవాన్ ఉదయం 08గం౹౹21ని౹౹ వరకు తదుపరి కింస్తుఘ్న రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 11గం౹౹37ని౹౹ నుండి 12గం౹౹29ని౹౹వరకు వర్జ్యం : లేదు అమృతకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹02ని౹౹ నుండి 11గం౹౹48ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹32ని సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹34ని౹I గురుబోధ: నీళ్లను తాగేటప్పుడు పెదవులకు తాకించకుండా చేతితో ఎత్తుకుని త్రాగాలి. పాలు ఇతరపదార్థాలు తీసుకుంటున్నప్పుడు పెదవుల శబ్దం(జుర్రుకుంటూ త్రాగే శబ్దం) రాకుండా తాగాలని శాస్త్రం.