"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జూన్ 25 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షము తిథి : ద్వాదశి ఈ రోజు రాత్రి 01గం౹౹16ని౹౹ వరకు తదుపరి త్రయోదశి వారం : స్థిరవారము (శనివారం) నక్షత్రం : భరణి ఈ రోజు ఉదయం 11గం౹౹49ని౹౹ వరకు తదుపరి కృత్తిక యోగం : ధృతి ఈ రోజు పూర్తిగా ఉంది కరణం : కౌలవ మధ్యాహ్నం 12గం౹౹08ని౹౹ వరకు తదుపరి తైతుల రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 05గం౹౹44ని౹౹ నుండి 07గం౹౹14ని౹౹ వరకు వర్జ్యం : ఈ రోజు రాత్రి 12గం౹౹53ని౹౹ నుండి 02గం౹౹37ని౹౹ వరకు అమృతకాలం : ఈ రోజు ఉదయం 06గం౹౹51ని౹౹ నుండి 08గం౹౹30ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹30ని సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹33ని౹I ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈ రోజు ఉదయం చేయవచ్చును. గురుబోధ: మణిద్వీప వర్ణన పారాయణము అంటే శ్రీవేదవ్యాసకృత శ్రీ మద్దేవీభాగవతం లోని (ద్వాదశ స్కంధంలో గల 10, 11,12 అధ్యాయాలు) 283 శ్లోకాల పారాయణము చేస్తేనే సంపూర్ణ ఫలితం వస్తుందని శాస్త్రం. - శ్రీ దేవీభాగవతము