"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 10 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠమాసం శుక్లపక్షము
తిథి : ఏకాదశి ఈ రోజు రాత్రి 01గం౹౹31ని౹౹ వరకు తదుపరి ద్వాదశి (శనివారం 11వ తేదీ రాత్రి 12.గం.ల వరకు)
వారం : భృగువారం (శుక్రవారం)
నక్షత్రం : చిత్ర ఈ రోజు రాత్రి 12గం౹౹03ని౹౹ వరకు తదుపరి స్వాతి
యోగం : వరీయాన్ రాత్రి 11గం౹౹36ని౹౹ వరకు తదుపరి పరిఘ
కరణం : గరజి ఈ రోజు ఉదయం 07గం౹౹25ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹04ని౹౹ నుండి 08గం౹౹56ని౹౹ వరకు & మధ్యాహ్నం12గం౹౹25ని౹౹ నుండి01గం౹౹17ని౹౹ వరకు
వర్జ్యం : ఈ రోజు ఉదయం 08గం౹౹07ని౹౹ నుండి 10గం౹౹01ని౹౹ వరకు
అమృతకాలం : ఈ రోజు సాయంత్రం 05గం౹౹44ని౹౹ నుండి 07గం౹౹18౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹28ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹29ని౹౹ వరకు
👉🏻🕉️ఏకాదశి🕉️
ఏకాదశీ ఉపవాసం శుక్రవారం ఉండాలి, ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ శనివారం ఉదయం చేయవచ్చును.
గురుబోధ:
ఒకసారి ధరించిన దుస్తులు ఉతకకుండా మళ్ళీ ధరిస్తే లక్ష్మీదేవి వారిని విడిచిపెడుతుంది.