"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఏప్రిల్ 29 2022🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షము తిథి: చతుర్దశి ఈ రోజు రాత్రి 12గం౹౹31ని౹౹ వరకు తదుపరి అమావాస్య వారం : భృగువారము (శుక్రవారం) నక్షత్రం: రేవతి ఈ రోజు రాత్రి 06గం౹౹42ని౹౹ వరకు తదుపరి అశ్విని యోగం: విష్కoభ ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹43ని౹౹ వరకు తదుపరి ప్రీతి కరణం : విష్టి ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹38ని౹౹ వరకు తదుపరి శకుని రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹11ని౹౹ నుండి 09గం౹౹01ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹23ని౹౹ నుండి 01గం౹౹13ని౹౹ వరకు వర్జ్యం: ఉదయం 06గం౹౹28ని౹౹ నుండి 08గం౹౹06ని౹౹ వరకు అమృతకాలం: సాయంత్రం 04గం౹౹15ని౹౹ నుండి 05గం౹౹53ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹39ని సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹15ని౹౹ వరకు గురుబోధ: చైత్ర కృష్ణపక్ష చతుర్దశి మానవుల జీవితాలను వారి వారి కర్మఫలాలను అనుసరించి నడుపుతూ సుఖదుఃఖాలను ఇచ్చేవారిలో నవగ్రహ దేవతలది ప్రధాన స్థానం. నవగ్రహాలలో ఒకరైన కేతువు గ్రహంగా ఆవిర్భవించినది చైత్రమాస కృష్ణపక్షచతుర్దశీ తిథి. ఈ తిథినాడు దర్భలు శిరస్సున ధరించి, నదీస్నానం చేసి కేతుతర్పణాలు ఇచ్చి, ఉలవలు దానం చేసినవారికి సకలబాధలూ తొలగిపోతాయి. ఊపిరితిత్తుల రోగాలు తత్ క్షణమే తొలగిపోతాయి.