"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఏప్రిల్ 04 2022🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసం శుక్ల పక్షము తిథి: తదియ ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹09ని౹౹ వరకు తదుపరి చతుర్థి వారం : ఇందువారము (సోమవారం) నక్షత్రం: భరణి మధ్యాహ్నం 01గం౹౹56ని౹౹ వరకు తదుపరి కృత్తిక యోగం: విష్కoభ ఈ రోజు ఉదయం 07గం౹౹43ని౹౹ వరకు తదుపరి ప్రీతి కరణం : గరజి ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹55ని౹౹ వరకు తదుపరి వణిజ రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹28ని౹౹ నుండి 01గం౹౹17ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹54ని౹౹ నుండి 03గం౹౹43ని౹౹ వరకు వర్జ్యం: రాత్రి 02గం౹౹56ని౹౹ నుండి 04గం౹౹40ని౹౹ వరకు అమృతకాలం: ఉదయం 08గం౹౹49ని౹౹ నుండి 10గం౹౹31ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹56ని సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹10ని౹౹ గురుబోధ: పురోహితుడు అంటే సరైన అర్థం - మంచి దారి చూపించేవాడు. పురః + హితుడు-> పురోహితుడు " పురస్తాత్ హితం ఇచ్చంతి పురోహితాః_ "- పురః - వెళ్లే మార్గం(ముందు). హితుడు సరైన విధానాన్ని చూపించువాడు. పురోహితుడు వెళ్లే మార్గంలో ఆటంకాలు లేకుండా మంచిమార్గం చూపించి రక్షించేవాడని అర్థం.