"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఫిబ్రవరి 14 2022🌟 శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసం శుక్ల పక్షము తిథి: త్రయోదశి రాత్రి 07గం౹౹59ని౹౹ వరకు తదుపరి చతుర్దశి వారం : ఇందువారము (సోమవారం) నక్షత్రం: పునర్వసు ఉదయం 11గం౹౹42ని౹౹ వరకు తదుపరి పుష్యమి యోగం: ఆయుష్మాన్ ఈ రోజు రాత్రి 09గం౹౹29ని౹౹ వరకు తదుపరి సౌభాగ్య కరణం : కౌలవ ఈ రోజు ఉదయం 07గం౹౹38ని౹౹ వరకు తదుపరి తైతుల రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹39ని౹౹ నుండి 01గం౹౹25ని౹౹ వరకు& మధ్యాహ్నం 02గం౹౹56ని౹౹ నుండి 03గం౹౹42ని౹౹ వరకు వర్జ్యం:రాత్రి 08గం౹౹23ని౹౹ నుండి 10గం౹౹07ని౹౹ వరకు అమృతకాలం: ఉదయం 09గం౹౹03ని౹౹ నుండి 10గం౹౹48ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹32ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹57ని౹౹ వరకు గురుబోధ మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ తమకోసము లేదా తమ ప్రీతిపాత్రులైన వారి కోసం ఈ దశదానములు తప్పక చేయాలని శాస్త్రం. అన్నీ చేయలేకపోతే స్తోమత బట్టి వాటిలో కొన్ని అయినా చేయాలని శాస్త్రము. శ్లో౹౹ గోభూతిల హిరణ్యాజ్య వాసోధాన్య గుడాస్తథా రజతం లవణం చైవ దానాని దశవై విదుః ౹౹ - గరుడపురాణం(ధర్మకాండము) 1. గోవులు 2. భూమి 3. తిలలు 4. హిరణ్యం 5. ఘృతము 6. వస్త్రం 7. ధాన్యం 8. బెల్లం 9. వెండి 10. ఉప్పు