December 17 2021డిసెంబర్ 17 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  డిసెంబర్ 17 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   హేమంత ఋతువు 
   మార్గశీర్ష మాసం శుక్లపక్షము

 తిథి: చతుర్దశి  ఈ రోజు పూర్తిగా ఉంది
వారం : భృగువారము (శుక్రవారం)
నక్షత్రం:  కృత్తిక ఈ రోజు ఉదయం 11గం౹౹01ని౹౹ వరకు తదుపరి రోహిణి
యోగం: సిద్ధ ఈ రోజు ఉదయం 08గం౹౹14ని౹౹ వరకు తదుపరి సాధ్య
కరణం  : గరజి  ఈ రోజు సాయంత్రం 06గం౹౹02ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం
10గం౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹38ని౹౹ నుండి 09గం౹౹22ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹18ని౹౹ నుండి 01గం౹౹02ని౹౹ వరకు
వర్జ్యం: లేదు
అమృతకాలం  ఉదయం 08గం౹౹22ని౹౹ నుండి 10గం౹౹07ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹26ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹25ని౹౹ వరకు 

🕉️పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 63 రోజుల సంపూర్ణ స్కాందపురాణ ప్రవచనం లోని  రెండవభాగం (21 రోజులు) డిసెంబర్ 6 నుండి 26 వరకు శ్రీ కృష్ణాలయం, అల్కాపురి సిగ్నల్స్, నాగోల్ (LB Nagar) హైదరాబాద్ లో జరుగుతోంది🕉️.

గురుబోధ
 దశదానములు 
 
మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ తమకోసము లేదా తమ ప్రీతిపాత్రులైన వారికోసం ఈ దశదానములు తప్పక చేయాలని శాస్త్రం. అన్నీ చేయలేకపోతే స్తోమత బట్టి వాటిలో కొన్ని అయినా చేయాలని శాస్త్రము 

 శ్లో౹౹ 
గోభూతిల హిరణ్యాజ్య
వాసోధాన్య గుడాస్తథా
రజతం లవణం చైవ
 దానాని దశవై విదు: ౹౹ -గరుడపురాణం(ధర్మకాండము)

1. గోవులు 2. భూమి 3.తిలలు 4. హిరణ్యం 5. ఘృతము 6 వస్త్రం 7. ధాన్యం 8.బెల్లం 9. వెండి 10. ఉప్పు
expand_less