"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 అక్టోబర్ 26 2021🌟 _శ్రీ ప్లవనామ సంవత్సరం_ దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం కృష్ణపక్షము తిథి: షష్ఠి ఈ రోజు పూర్తిగా ఉంది వారం : భౌమవారము (మంగళవారం) నక్షత్రం: ఆరుద్ర ఈ రోజు తెల్లవారి 04గం౹౹35ని౹౹ తదుపరి పునర్వసు యోగం: శివ ఈ రోజు పూర్తిగా ఉంది కరణం : తైతుల ఈ రోజు ఉదయం 08గం౹౹23ని౹౹ వరకు తదుపరి గరజి రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹14ని౹౹ నుండి 09గం౹౹04ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹28ని౹౹ నుండి 11గం౹౹17ని౹౹ వరకు వర్జ్యం: ఉదయం 10గం౹౹57ని౹౹ నుండి 12గం౹౹42ని౹౹ వరకు అమృతకాలం సాయంత్రం 05గం౹౹07ని౹౹ నుండి 06గం౹౹52ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹00ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹34ని౹౹ వరకు గురుబోధ: సదాచారాలు పాటించేవారికి సకలశుభాలు దేవతలు ప్రసాదిస్తారు. వారు ప్రత్యేక పూజలు, జపములు కూడా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆచారాలు పాటించకుండా ఎన్ని పూజలు, జపములు చేసినా దేవతలు అనుగ్రహించరు.