"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 అక్టోబర్ 24 2021🌟 _శ్రీ ప్లవనామ సంవత్సరం_ దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం కృష్ణపక్షము తిథి: చతుర్థి రాత్రి 02గం౹౹19ని౹౹ తదుపరి పంచమి వారం : భానువారము (ఆదివారం) నక్షత్రం: రోహిణి ఈ రోజు రాత్రి 11గం౹౹05ని౹౹ తదుపరి మృగశిర యోగం: వరియన్ ఈ రోజు రాత్రి 10గం౹౹23ని౹౹ వరకు తదుపరి పరిఘ కరణం : బవ ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹54ని౹౹ వరకు తదుపరి కౌలవ రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు సాయంత్రం 04గం౹౹01ని౹౹ నుండి 04గం౹౹48ని౹౹ వరకు వర్జ్యం: మధ్యాహ్నం 02గం౹౹12ని౹౹ నుండి 03గం౹౹58ని౹౹ వరకు & తెల్లవారి 03గం౹౹40ని౹౹ నుండి 05గం౹౹17ని౹౹ వరకు అమృతకాలం రాత్రి 09గం౹౹32ని౹౹ నుండి 11గం౹౹18ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹58ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹35ని౹౹ వరకు గురుబోధ: మనం ఆచమనం చేసిన పంచపాత్రలోని నీటిని దేవునికి నైవేద్యం, అర్ఘ్యం, తర్పణం లేదా నీరాజనము ఇవ్వడానికి ఉపయోగించరాదు. అందుకే రెండు పంచపాత్రలు అనగా మన ఆచమనానికి ఒకటి మరొకటి దేవతా పూజకు వాడాలని శాస్త్రం.