కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 22 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము శుక్ల పక్షం
తిథి: ఏకాదశి ఉ.11.20 కు తదుపరి ద్వాదశి 23 ఉ.11.41 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: శతభిషం సా.6.44 కు తదుపరి పూర్వాభాద్ర 23 రా.7.32 కు
యోగం: వృద్ధి రా.11:39 కు తదుపరి ధ్రువ 23 రా.10:08 కు
కరణం: విష్టి మ.2:48 కు, బవ రా.2.48 కు తదుపరి బాలవ 23 మ.2:36 కు
రాహుకాలం: మ. 01.30 – 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.05 – 10.51 కు, మ. 2.42 – 3.28 కు
వర్జ్యం: రా.1.21 – 3.00 కు
అమృతకాలం: మ. 01.21 – 03.02 కు
సూర్యోదయం: ఉ. 6.14 కు
సూర్యాస్తమయం: సా. 5.46 కు
🕉️ ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి 🕉️
ఏకాదశీ ఉపవాసం గురువారం ఉండాలి. ద్వాదశీపారణ శుక్రవారం ఉ.11.30 లోపు చెయ్యాలి.
గురుబోధ:
🕉️ఏకాదశి అంటే హరిహరులకు ప్రీతి. ఏకాదశి అనే మాట వింటేనే యమకింకరులు వణికిపోతారు. తులసీదళాలతో హరిని, బిల్వదళాలతో హరుడిని అర్చన చేసి, ఉపవాసం ఉండి రాత్రికి నక్త భోజనం కానీ లేదా సంపూర్ణ ఉపవాసం కానీ ఉండి భగవంతుని కథలు వింటూ భగవత్ ధ్యానం చేసినవాడు జీవితంలో యమకింకరుల దర్శనము చేయడు. నరకానికి వెళ్ళడు. సకల శుభాలు పొందుతాడు.
🕉️60 సం.లు దాటిన వారికి, 11 సం.లు లోపు వారికి, అనారోగ్యవంతులకు, గర్భిణీస్త్రీలకు కూడా ఉపవాస నియమాలు లేవు. విష్ణుస్వరూపమైన పరమపవిత్ర ఏకాదశి నాడు ఎవరైతే భక్తిశ్రద్ధలతో హరినామస్మరణం, పురాణశ్రవణం, గోసేవ, యథాశక్తి దానధర్మాలు చేస్తారో, వారి సమస్తపాపక్షయమై, సర్వశుభాలను పొందుతారు.
శ్రీ వాసుదేవ శత నామాలు👇
https://youtu.be/DpjBm71jA_s?si=HVznXhr9Kz3xvT1Q