కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 19 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము శుక్ల పక్షం
తిథి: అష్టమి ఉ.7.28 కు తదుపరి నవమి 20 ఉ.9.11 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: ఉత్తరాషాఢ ప.1.33 కు తదుపరి శ్రవణం 20 ప.3.43 కు
యోగం: ధ్రుతి రా.12:34 కు తదుపరి శూల 20 రా.12:49 కు
కరణం: బవ ఉ.10:58 కు, బాలవ 19 రా.11:55 కు తదుపరి కౌలవ 20 మ.12:50 కు
రాహుకాలం: ఉ. 07.30 – 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.24 – 1.10 కు, మ. 2.43 – 3.29 కు
వర్జ్యం: సా.5.55 – 7.39 కు
అమృతకాలం: ఉ. 08.28 – 10.16 కు
సూర్యోదయం: ఉ. 6.14 కు
సూర్యాస్తమయం: సా. 5.48 కు
🕉️ మహానవమి, ఆయుధ/వాహనపూజ, స్వారోచిషమన్వాది, శరన్నవరాత్రులు 9వ రోజు- ఏలూరు శ్రీ ప్రణవపీఠంలో శ్రీ మహిషాసుర మర్దని (మహానవమి) అలంకారం 🕉️
గురుబోధ:
🕉️శరన్నవరాత్రులలో వచ్చే నవమీ తిథినాడు ఆయుధపూజ, వాహన లేదా యంత్రములకు తగిన విధంగా పూజ చేయాలి. దశమి నాడు తప్పక శమీపూజ చేయాలి.
🕉️వేదములు స్వయంగా అమ్మవారిని ఈ స్తోత్రంతో స్తుతించాయి. ఈ స్తోత్రాన్ని భక్తితో ఒక్కసారి చదివినా, విన్నా వాళ్ళలో స్వయంగా అమ్మవారు ఉంటుందని, వారికి సర్వశుభాలు ఇస్తానని అమ్మవారు వరం ఇచ్చింది.
వేదస్తుతి – అమ్మవారిని 4 వేదాలు స్తుతించిన స్తోత్రం👇
https://youtu.be/RQkosU7Ae0A?si=O0nzJTkQfytlxh7-