Oct 18 2026అక్టోబరు 18 2026favorite_border

కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 18 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము శుక్ల పక్షం

తిథి: అష్టమి 19 ఉ.7.28 కు తదుపరి నవమి 20 ఉ.9.11 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: పూర్వాషాఢ ఉ.11.07 కు తదుపరి ఉత్తరాషాఢ 19 ప.1.33 కు
యోగం: సుకర్మ రా.11.55 కు తదుపరి ధ్రుతి 19 రా.12:34 కు
కరణం: వణిజ ఉ. 8.28 కు, విష్టి రా.9:42 కు తదుపరి బవ 19 ఉ.10:58 కు
రాహుకాలం: సా. 04.30 – 06.00 కు
దుర్ముహూర్తం: మ. 4.16 – 5.02 కు
వర్జ్యం: రా.7.55 – 9.41 కు
అమృతకాలం: ఉ. 07.28 – 09.16 కు
సూర్యోదయం: ఉ. 6.13 కు
సూర్యాస్తమయం: సా. 5.48 కు

🕉️ శరన్నవరాత్రులు 8వ రోజు- ఏలూరు శ్రీ ప్రణవపీఠంలో శ్రీ దుర్గాదేవి (దుర్గాష్టమి) అలంకారం (గాజుల అలంకారం), తులా సంక్రమణం🕉️

గురుబోధ:
🕉️ఈ రోజు అమ్మవారు దుర్గముడను రాక్షసుని వధించిన ఘట్టం పారాయణ చేసినా మఱియు శ్రవణం చేసినా విశేష ఫలితం వస్తుంది.
🕉️శ్రీ దుర్గాష్టోత్తర శతనామపారాయణం వలన అష్టకష్టాల్లో నుండి బయటపడతారు, అష్టైశ్వర్యాలను పొందుతారు, దీనిని నిరంతరం పారాయణం చేస్తే ఆత్మబలం, జ్ఞానం పెరుగుతాయి, పనులు చెయ్యడానికి కావలసిన శక్తి లభిస్తుంది, ఈ నామాలను శుచిగా ఉండి భక్తిశ్రద్ధలతో ఎప్పుడైనా పారాయణం చేసుకోవచ్చు. కానీ, అష్టమి, నవమి, చతుర్దశి అనే మూడు తిథులూ అమ్మవారికి చాలా ఇష్టం. అటువంటి పవిత్రకాలాల్లో చేస్తే తిరుగులేని అద్భుతఫలితం లభిస్తుంది.
• శ్రీ మద్దేవీభాగవత గ్రంథములో 12 స్కంధములు మొత్తం పారాయణము చేయలేని, వారు కనీసం 9వ స్కంధం అయినా పారాయణము చేసుకోవచ్చు, అది సకల పుణ్యప్రదం, సర్వ శుభదాయకం.

శ్రీ దుర్గాష్టోత్తర శతనామావళి👇
https://youtu.be/GNNNIDBcOV0?si=fAIhnz7bm3sqdYbY

శ్రీ అర్జునకృత దుర్గా స్తోత్రం👇
https://youtu.be/Q3qrCTG6-3w?si=pM9PCs77wVgi2iGi

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

expand_less