Oct 04 2026అక్టోబరు 04 2026favorite_border

కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 04 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము కృష్ణ పక్షం

తిథి: అష్టమి ఉ.7.32 కు , నవమి 5 తె.5.13 కు తదుపరి దశమి 6 తె.3.00 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: పునర్వసు రా.2.32 కు తదుపరి పుష్యమి 5 రా.1.02 కు
యోగం: *పరిఘ మ.12:31 కు తదుపరి శివ 5 ఉ.9:51 కు
కరణం: తైతుల సా.4:51 కు, గరిజ తె.3.54 కు తదుపరి వణిజ 5 మ.2:59 కు
రాహుకాలం: సా. 04.30 – 06.00 కు
దుర్ముహూర్తం: సా. 4.24 – 5.11 కు
వర్జ్యం: ప.3.21 – 4.50 కు
అమృతకాలం: సా. 09.56 – 11.27 కు
సూర్యోదయం: ఉ. 6.10 కు
సూర్యాస్తమయం: సా. 5.59 కు

🕉️ అవిధవా నవమి, మహాలయపక్షాలు (పితృపక్షములు), 8వ దినము 🕉️

గురుబోధ:
🔺పితృకార్యాలు చేయని వారు దేవతాపూజ, పండుగలు జరుపుకోవచ్చా?
◆ పితృకార్యాలు చేయని వారికి దేవతాపూజ చేసే అర్హత ఉండదు. చేసినా ఫలితం లభించదని శాస్త్రం. దేవతలు కూడా పితృదేవతలని పూజిస్తారు.
🔺ఎన్ని దేవతా పూజలు చేసినా లేదా కోరికల కోసం దీక్షలు వహించినా లేదా దేవతా ప్రీత్యర్థం హోమము, అభిషేకాలు చేసినా కొందరి ఇంటిలో అశాంతి, పిల్లల వల్ల అభద్రత ఎందుకు వస్తుంటాయి?  
◆ ఆ ఇంటిలో పితృ దేవతల ఆరాధన సరిగ్గా జరగక పోవడం వల్ల.
🔺పితృకార్యాలు చేసేటప్పుడు ముఖ్యంగా వేటిని స్వీకరించరాదు?
◆ మజ్జిగ, రాగి జావ
🔺పితృదేవతలను ఏమని కోరుకోవాలి?
◆ మా వంశం వృద్ధి చెందుగాక. మా వంశంలో దాతలు, వేదం చదువుకున్నవారు పెరుగు గాక, నీచులు పుట్టకుండా ఉండుగాక, మేము శ్రద్ధతో మంచి కార్యక్రమములు చేయుదుము గాక అని కోరుకోవాలి.
🔺పితృ కార్యాలలో వేటితో చేసిన పాత్రలను, పళ్ళాలను, వస్తువులను వాడినా లేదా దానం చేసినా మంచిదని శాస్త్రం?
◆ వెండితో చేసిన పాత్రలను వాడడం, దానం చేయడం మంచిది.
🔺పితృకార్యాలను ఎంతో భక్తితో, శ్రద్ధతో చేస్తారు. ఈ కార్యక్రమం చేసేటప్పుడు కొన్ని పనులు అస్సలు చేయరాదు. అవి ఏమిటి?  
◆ ఆ పూట కోపం అస్సలు పనికి రాదు. బ్రహ్మచర్యం పాటించాలి. కార్యక్రమం చేసే బ్రహ్మ గారిని విసుక్కోవడం లేదా త్వరగా ముగించమని చెప్పడం చేయరాదు.

పితృదేవతా స్తోత్రం👇
https://youtu.be/UgnxFM4YHYY?si=uUfkETkRGcPPOrTw

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

expand_less