Sep 29 2026సెప్టెంబరు 29 2026favorite_border

కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 29 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము కృష్ణ పక్షం

తిథి: తదియ సా.6.35 కు తదుపరి చతుర్థి 30 సా.4.44 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: అశ్వని ఉ.11.18 కు తదుపరి భరణి 30 ఉ.10.16 30 కు
యోగం: వ్యాఘాత ఉ.6:12 కు, హర్షణ 30 తె.3:20 కు తదుపరి వజ్ర 01 రా.12:20 కు
కరణం: వణిజ ఉ.6:14 కు, విష్టి సా.5:10 కు తదుపరి బవ 30 తె.4:04 కు
రాహుకాలం: మ. 03.00 – 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 8.32 – 9.20 కు, రా. 10.53 – 11.42 కు
వర్జ్యం: ఉ.7.25 – 8.58 కు, రా.8.29 – 10.01 కు
అమృతకాలం: తె. 02.12 – 03.43 కు తదుపరి తె. 03.05 – 04.35 కు
సూర్యోదయం: ఉ. 6.09 కు
సూర్యాస్తమయం: సా. 6.03 కు

🕉️ మహాలయ పక్షారంభము (పితృపక్షములు), 4వ రోజు, అంగారక చతుర్థి, సంకటహర చతుర్థి🕉️

గురుబోధ:
🕉️పితృదేవతల ఆరాధన చేయకుండా ఎన్ని జపతపాలు తీర్థయాత్రలు చేసినా ఫలితం ఉండదు. పితృదేవతల ఆరాధన అనగా చనిపోయిన పెద్దలకు సకాలంలో తర్పణాలు, పిండప్రదానాలు, వారిని ఉద్దేశించి దానధర్మాలు చేయడం మొ౹౹ చేయాలి. దేవతలు కూడా పితృదేవతలను పూజిస్తారు.
గణేశుని అనుగ్రహం కోసం ప్రతి మాసం కృష్ణపక్షం లో వచ్చే చతుర్థిన సంకటహర చతుర్థీ వ్రతం ఆచరిస్తారు.
శ్రీ గణేశ పంచరత్నమాలా స్తోత్రం👇
https://youtu.be/V9W-UfGJ4uY?si=KcbKrWzwx9dhesuO
🕉️👆విఘ్నాలను, ఆటంకాలను, భయంకరమైన రోగాలను తొలగించి అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని ప్రసాదిస్తుంది.
🕉️👆ఈ స్తోత్రం పారాయణం చేసినా లేక విన్నా కూడా అద్భుత ఫలితాలు లభిస్తాయి. అనుకున్న పనులు అయ్యి తీరుతాయి. ముఖ్యంగా చతుర్థి , సంకటహరచతుర్థి ఈ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఎంతో మంచిది.
శ్రీ గణేశ భుజంగ స్తోత్రం👇
https://youtu.be/tOm3F2CXUOg?si=nninXL-i109Cj9Et
🕉️👆ఉద్యోగం కావాలనుకున్నవారు 40 రోజుల పాటు ఈ స్తోత్రాన్ని వినండి, పారాయణం చెయ్యండి, ఉద్యోగం వచ్చి తీరుతుంది, విదేశీయానప్రాప్తి.
🕉️👆భార్యాభర్తల మధ్యలో కీచులాటలు ఎక్కువైపోతున్నప్పుడు తొమ్మిది (9) చతుర్థీ (చవితి) తిథులలో అనగా వరుసగా చవితి వచ్చినప్పుడల్లా, పారాయణం చేసినా, విన్నా భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం వస్తుంది.
🕉️గణేశుని అనుగ్రహం కోసం ప్రతి మాసం కృష్ణపక్షంలో వచ్చే చతుర్థిన సంకటహర చతుర్థీ వ్రతం ఆచరిస్తారు. ఈ చతుర్థి మంగళవారం వస్తే ఆ పర్వదినమును అంగారక చతుర్థి లేదా భౌమచతుర్థి అంటారు. ఇది మరింత విశేష ఫలితం ఇస్తుంది.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

expand_less