కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 28 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము కృష్ణ పక్షం
తిథి: విదియ రా.8.05 కు తదుపరి తదియ 29 సా.6.35 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: రేవతి ప.11.58 కు తదుపరి అశ్విని 29 ఉ.11.18 కు
యోగం: ధ్రువ ఉ.8:53 కు తదుపరి వ్యాఘాత 29 ఉ.6:12 కు
కరణం: తైతుల ఉ. 08.09 కు, గరజి రా.7:14 కు తదుపరి వణిజ 29 ఉ.6:14 కు
రాహుకాలం: ఉ. 07.30 – 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.30 – 1.18 కు, మ. 2.53 – 3.41 కు
వర్జ్యం: లేదు
అమృతకాలం: ఉ. 07.57 – 09.29 కు
సూర్యోదయం: ఉ. 6.09 కు
సూర్యాస్తమయం: సా. 6.04 కు
🕉️ మహాలయ పక్షారంభము (పితృపక్షములు), 2వ రోజు 🕉️
గురుబోధ:
👉భాద్రపదమాసం లో పూర్ణిమ తరువాత వచ్చే పాడ్యమి మొదలుకుని అమావాస్య వరకు ఉండే 15 రోజులను మహాలయపక్షము లేదా పితృ పక్షం అంటారు ఈ 15 రోజులలో చనిపోయిన వారి తిథిని బట్టి శ్రాద్ధం నిర్వహిస్తే అది గయాశ్రాద్ధంతో సమానము.
👉ఒకే ఇంటి పేరు ఉన్న వారిని భోక్తగా పిలువరాదు. సగోత్రీకులని పిలువవచ్చు. ఒక్క యోగి లేదా పురాణజ్ఞుడు, పండితుడు భోక్తగా వస్తే అక్షయ ఫలితం వస్తుంది.
👉మహాలయపక్షాలు లేదా పితృపక్షాలు పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైన రోజులు, పితృదేవతల అనుగ్రహాన్ని విశేషంగా ప్రసాదించే రోజులు. మన పేరు మీద, మన పిల్లలు లేదా పెద్దల పేరు మీద లేదా స్వర్గస్తులైన వారి పేరు మీద చేసే గోసేవ వల్ల పితృదేవతలు సంతోషించి ఆ వంశాన్ని సంపూర్ణంగా ఆశీర్వదిస్తారు.