Sep 24 2026సెప్టెంబరు 24 2026favorite_border

కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 24 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్ల పక్షం

తిథి: త్రయోదశి రా.9.45 కు తదుపరి చతుర్దశి 25 రా.10.05 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: ధనిష్ఠ ఉ.10.13 కు తదుపరి శతభిషం 25 ఉ.11.23 కు
యోగం: *ధృతి సా.3:54 కు తదుపరి శూల 25 మ.2:50 కు
కరణం: కౌలవ ఉ.11:09 కు, తైతుల రా.11:18 కు తదుపరి గరజి 25 ఉ.11:09 కు
రాహుకాలం: మ. 01.30 – 03.00 కు
దుర్ముహూర్తం: ఉ.10.08 – 10.56 కు, మ. 2.55 – 3.43 కు
వర్జ్యం: సా.5.45 – 7.26 కు
అమృతకాలం: తె. 03.55 – 05.34 కు
సూర్యోదయం: ఉ. 6.09 కు
సూర్యాస్తమయం: సా. 6.07 కు

గురుబోధ:
మనం ఎంత భక్తులమైనా, ఉపాసకులమైనా పితృకార్యములు చేయనివారికి కష్టాలు తప్పవు. సాక్షాత్తు రాముడు, కృష్ణుడు కూడా పితృకార్యక్రమాలు చేసారు. మనం చేయకపోతే ఎలా?
శ్రాద్ధం నాడు తప్పక తర్పణాలు విడవాలి. వాటికి మినహాయింపు లేదు. శ్రాద్ధములో కొన్ని విధానాలు.

  1. క్షణ శ్రాద్ధం – యోగ్యులైన భోక్తలను విశ్వే, పితృస్థానాలలో ఆహ్వానించి శాస్త్రోక్తంగా శ్రాద్ధం జరిపించడం.
  2. కూర్చ శ్రాద్ధం – యోగ్యులు దొరకకపోతే, దర్భలలో విశ్వే, పితృదేవతలను ఆహ్వానం చేసి శాస్త్రోక్తంగా శ్రాద్ధం జరిపించడం.
  3. ఆమ శ్రాద్ధం – పై రెండు కుదరనప్పుడు స్వయంపాకం, దక్షిణతో దానం ఇవ్వడం.
  4. హేమ శ్రాద్ధం – పై 3 కుదరనప్పుడు, శ్రాద్ధముకు తగిన బంగారం, వెండి లేదా ధనమును దానం చేయడం.
  5. సంకల్ప తర్పణము – పై 4 కుదరనప్పుడు సంకల్పం చెప్పుకొని అర్ఘ్యం, తర్పణం మొ|| ఇవ్వడం.
  6. గోగ్రాస ప్రదానము – పై 5 కుదరనప్పుడు గోవుకు యథాశక్తి గ్రాసం సమర్పించి, గోవుకు, పితృదేవతలకు నమస్కరించడం.
  7. పితృ ప్రార్థన – రెండు చేతులెత్తి ఆకాశం వైపు చూస్తూ పితృదేవతలారా! నేను పైన చెప్పిన ఏ విధమైన శ్రాద్ధం పెట్టలేను. నా దగ్గర ధనం లేదు. కనీసం గోవుకు గ్రాసం కూడా ఇచ్చే స్థితిలో లేను. దయచేసి నన్ను మన్నించండని ప్రార్థించాలి.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

expand_less