కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 22 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్ల పక్షం
తిథి: ఏకాదశి రా.7.39 కు తదుపరి ద్వాదశి 23 రా.8.55 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: ఉత్తరాషాఢ ఉ.6.31కు తదుపరి శ్రవణం 23 ఉ.8.34 కు
యోగం: అతిగండ సా.4:28 కు తదుపరి సుకర్మ 23 సా.4:26 కు
కరణం: వణిజ ఉ.8:56 కు, విష్టి రా.9:43 కు తదుపరి బవ 23 ఉ.10:51 కు
రాహుకాలం: మ. 03.00 – 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 8.32 – 9.20 కు, రా. 10.57 – 11.45 కు
వర్జ్యం: ఉ.10.51 – 12.36 కు
అమృతకాలం: రా. 10.00 – 11.44 కు
సూర్యోదయం: ఉ. 6.08 కు
సూర్యాస్తమయం: సా. 6.09 కు
🕉️ పద్మనాభ ఏకాదశి 🕉️
ఏకాదశీ ఉపవాసం మంగళవారం ఉండాలి. ఉపవాసం ఉన్నవారు ద్వాదశీపారణ బుధవారం చెయ్యాలి.
గురుబోధ:
- ఈ భాద్రపద శుక్ల ఏకాదశిని పద్మనాభ ఏకాదశి అంటారు. ఇది భద్రములు కలిగిస్తుంది.
- అనావృష్టి తొలగాలంటే, వర్షములు సకాలంలో కురవాలంటే, రోగములు తొలగాలంటే ఈ ఉపవాస దీక్ష చేస్తే తొలగిపోతాయి. సంతృప్తి రావాలంటే కూడా ఈ ఏకాదశీ ఉపవాస వ్రతం చేసి భక్తితో ఆ భగవంతుడిని ప్రార్థిస్తే మనశ్శాంతి కలుగుతుంది.
శ్రీ వాసుదేవ శత నామాలు👇
https://youtu.be/DpjBm71jA_s?si=HVznXhr9Kz3xvT1Q