కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 18 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్ల పక్షం
తిథి: సప్తమి ప.11.58 కు తదుపరి అష్టమి 19 ప.1.59 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: జ్యేష్ఠ రా.10.55 కు తదుపరి మూల 19 రా.1.29 కు
యోగం: ప్రీతి మ.1:34 కు తదుపరి ఆయుష్మాన్ 19 మ.2:28 కు
కరణం: వణిజ మ.1:01 కు, విష్టి తె.2:13 కు తదుపరి బవ 19 మ.3:27 కు
రాహుకాలం: ఉ. 10.30 – 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 8.33 – 9.21కు, మ. 12.34 – 1.22 కు
వర్జ్యం: లేదు
అమృతకాలం: మ. 12.53 – 02.41 కు
సూర్యోదయం: ఉ. 6.08 కు
సూర్యాస్తమయం: సా. 6.12 కు
గురుబోధ:
శ్లో. ఏకాదశ్యా సహస్రేణ యత్ఫలం లభతే నరః |
రాధాజన్మాష్టమీ పుణ్యం తస్మాత్ శత గుణాధికమ్ || శ్రీ పద్మపురాణం, బ్రహ్మఖండం
ఫలశ్రుతి: ఏకాదశీ వ్రతమున కంటే కూడా గొప్ప ఫలమిచ్చే అపూర్వ వ్రతము, భాద్రపద శుక్లపక్ష అష్టమి నాడు చేసే రాధాష్టమీ వ్రతము. 1000 ఏకాదశీ వ్రతముల ఫలానికి నూరురెట్లు – అంటే లక్ష ఏకాదశీ వ్రతములు ఆచరించినంత పుణ్యఫలాన్ని – ఒక్కసారి రాధాష్టమీ వ్రతాన్ని భక్తితో ఆచరించడం ద్వారా పొందవచ్చని పద్మపురాణంలోని ఈ వ్రతమహిమ చెపుతోంది. అందుకే శ్రీరాధాదేవి అనుగ్రహాన్ని ప్రసాదించే రాధాష్టమీ వ్రతం అత్యంత విశిష్టమైనది, మహిమాన్వితమైనది.
రాధాష్టమీ వ్రతము ఆచరించే వారి ఇంట కరవు కాటకములు ఉండవు. అన్యోన్య దాంపత్యాన్ని, అష్టైశ్వర్యాలను ప్రసాదించే అపూర్వ వ్రతమిది.