Sep 16 2026సెప్టెంబరు 16 2026favorite_border

కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 16 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్ల పక్షం

తిథి: పంచమి ఉ.8.43 కు తదుపరి షష్ఠి 17 ఉ.10.10 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: విశాఖ సా.6.19 కు తదుపరి అనూరాధ 17 రా.8.28 కు
యోగం: వైధృతి మ.12:22 కు తదుపరి విష్కంభ 17 మ.12:49 కు
కరణం: బాలవ ఉ.8:59 కు, కౌలవ రా.9:50 కు తదుపరి తైతుల 17 ఉ.10:48 కు
రాహుకాలం: మ. 12.00 – 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.46 – 12.35 కు
వర్జ్యం: రా.10.40 – 12.25 కు
అమృతకాలం: ఉ. 07.53 – 09.37 కు
సూర్యోదయం: ఉ. 6.08 కు
సూర్యాస్తమయం: సా. 6.14 కు

🕉️ భాద్రపద శుద్ధ షష్ఠి – సూర్య షష్ఠి 🕉️

గురుబోధ:
సప్తమి కలిసిన షష్ఠి సూర్య భగవానుడికి ప్రీతికరం. ఈ రోజు సూర్యుడుని ఆవుపాలు, పెరుగు, నెయ్యి, గోమయం, గోమూత్రంతో ప్రసన్నం చేసుకుంటే అశ్వమేధయాగం చేసిన ఫలితం కన్నా ఎక్కువ ఫలితం పొందుతాము. షష్ఠి రోజు సుబ్రహ్మణ్య ఆరాధన కూడా విశేషఫలితం ప్రసాదిస్తుందని పెద్దలు చెప్తారు.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

expand_less