కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 12 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్ల పక్షం
తిథి: శు.పాడ్యమి ఉ.7.43 కు తదుపరి విదియ 13 ఉ.7.11 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: ఉత్తర ప.2.07 కు తదుపరి హస్త 13 ప.2.25 కు
యోగం: శుభ మ.3:08 కు తదుపరి శుక్ల 13 మ.1:42 కు
కరణం: బవ ఉ.7:46 కు, బాలవ రా.7:23 కు తదుపరి కౌలవ 13 ఉ.7:08 కు
రాహుకాలం: ఉ. 09.00 – 10.30 కు
దుర్ముహూర్తం: ఉ. 7.44 – 8.33 కు
వర్జ్యం: రా.10.37 – 12.14 కు
అమృతకాలం: తె. 05.49 – 07.23 కు
సూర్యోదయం: ఉ. 6.07 కు
సూర్యాస్తమయం: సా. 6.17 కు
గురుబోధ:
🕉️శ్రీ గణేశ భుజంగ స్తోత్రం👇
https://youtu.be/tOm3F2CXUOg?si=CwlbQLD31KoTbefw
ఈ స్తోత్రం భార్యాభర్తల మధ్యలో కీచులాటలు ఎక్కువైపోతున్నప్పుడు తొమ్మిది (9) చతుర్థీ (చవితి) తిథులలో అనగా వరుసగా చవితి వచ్చినప్పుడల్లా, పారాయణం చేసినా, విన్నా భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం వస్తుంది. ప్రతి శుక్లపక్ష చతుర్థినాడు ఈ స్తోత్రాన్ని విన్నవారికి సంపదలు లభిస్తాయి. ఉద్యోగం కావాలనుకున్నవారు 40 రోజుల పాటు ఈ స్తోత్రాన్ని వినండి. గణేశాలయంలో ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఈ స్తోత్రం వింటే, భూప్రదక్షిణ చేసిన ఫలితం. భయంకరమైన జాతకదోషాలు తొలగించి, విదేశీయానం కావాలనుకొన్నవారికి లభించేలా చేస్తుంది.
🕉️శాస్త్రప్రకారం వినాయకుని పూజకు ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎటువంటి సందర్భంలోనూ తులసీదళాలు ఉపయోగించరాదు. “శ్రీ శివపురాణం”లో తులసీదళానికి బదులుగా “శిరీషదళము” అని ఉన్నది. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు.