కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 10 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము కృష్ణ పక్షం
తిథి: చతుర్దశి ఉ.10.09 కు తదుపరి అమావాస్య 11 ఉ.8.43 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: మఘ ప.2.52 కు తదుపరి పుబ్బ 11 ప.2.17 కు
యోగం: సిద్ధ రా.7:17 కు తదుపరి సాధ్య 11 సా.5:01 కు
కరణం: శకుని ఉ.10:33 కు, చతుష్పాద రా.9:42 కు తదుపరి నాగ 11 ఉ.8:57 కు
రాహుకాలం: మ. 01.30 – 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.11 – 10.59 కు, మ. 3.03 – 3.52 కు
వర్జ్యం: తె.3.21 – 4.53 కు, రా.10.40 – 12.14 కు
అమృతకాలం: ఉ. 11.46 – 01.17 కు
సూర్యోదయం: ఉ. 6.07 కు
సూర్యాస్తమయం: సా. 6.19 కు
🕉️ పోలాల అమావాస్య, రుద్రసావర్ణి మన్వాది🕉️
గురుబోధ:
✓ సత్సంతానము కోసం, గర్భదోషాలు తొలగడానికి, పిల్లల భవిష్యత్ బాగుండడానికి పోలాల అమావాస్య వ్రతం చేయడం మంచిది.
✓ అమావాస్య పితృదేవతల కు తర్పణములు యథాశక్తి శ్రాద్ధం లేదా స్వయంపాక దానము చేయడం మంచిది. పితృదేవతా స్తవం పారాయణం ఉత్తమం.
పితృదేవతా స్తోత్రము 👇
https://youtu.be/UgnxFM4YHYY?si=jRPSZaZUj_JlPw7k