Aug 20 2026ఆగష్టు 20 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 20 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల పక్షం

తిథి: అష్టమి రా.9.50 కు తదుపరి నవమి 21 రా.11.37 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: విశాఖ ఉ.11.02 కు తదుపరి అనూరాధ 21 ప.1.18 కు
యోగం: ఐంద్ర 21 తె.4:24 కు తదుపరి వైధృతి 22 తె.5:18 కు
కరణం: విష్టి ఉ. 08:16 కు, బవ రా.9:18 కు తదుపరి బాలవ 21 ఉ.10:26 కు
రాహుకాలం:
మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం:
ఉ. 10.14 - 11.04 కు, మ. 3.14 - 4.04 కు
వర్జ్యం:
మ.3.25 - 5.10 కు
అమృతకాలం:
రా. 12.16 - 02.03 కు
సూర్యోదయం:
ఉ. 6.04 కు
సూర్యాస్తమయం:
సా. 6.35 కు

గురుబోధ:*
🕉️పురాణములు వినడానికి ఎటువంటి నియమం లేదు. శ్రద్ధ, భక్తి ఉంటే చాలు. తింటూ, పనిచేస్తూ, భోజనం చేస్తూ, ప్రయాణం చేస్తూ కూడా వినవచ్చు. ఇంతకంటే తరించే సులభోపాయం మరొకటి లేదు. పురాణ గ్రంథములను భక్తితో పూజించినా ఆ పురాణ అధిష్ఠానదేవతలు మనల్ని అనుగ్రహిస్తారు. కలియుగంలో తరించడానికి పురాణ శ్రవణమునకు మించిన ధర్మం, పుణ్యం లేదని సకల శాస్త్రాలు చెపుతున్నాయి. పరీక్షిత్, శ్రీ శుకుడు, వ్యాసుడు, సూతుడు, నారదుడు, మరెందరో ఋషులు, భక్తులు సద్గురువుల ద్వారా పురాణమును విని తరించారు.
🕉️పురాణ శ్రవణము, యాత్రాఫలితం, మనం చేసే దాన ధర్మములు మనలని, మన పిల్లలని, మన వంశాన్ని కూడా తరింపచేస్తాయి.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less