కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 18 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల పక్షం
తిథి: షష్ఠి రా.7.27 కు తదుపరి సప్తమి 19 రా.8.27 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: చిత్ర ఉ.7.43 కు తదుపరి స్వాతి 19 ఉ.9.10 కు
యోగం: శుక్ల రా.3:22 కు తదుపరి బ్రహ్మ 19 రా.3:43 కు
కరణం: తైతుల సా.5:51 కు తదుపరి గరిజ 19 ఉ.6:31 కు, వణిజ 19 రా.7:20 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 8.34 - 9.24 కు, రా. 11.11 - 11.57 కు
వర్జ్యం: మ.1.39 - 3.21 కు
అమృతకాలం: సా. 09.18 - 11.01 కు
సూర్యోదయం: ఉ. 6.03 కు
సూర్యాస్తమయం: సా. 6.36 కు
🕉️ శ్రావణమంగళగౌరీ వ్రతము 🕉️
గురుబోధ:
1) గౌరీ దేవి శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం నాడు భూసంచారం చేసి, తాను చెప్పిన విధంగా చేసిన స్త్రీలను అనుగ్రహిస్తాను అని అన్నది.
2) భూలోకంలో అగస్త్య మహర్షి భార్య లోపాముద్ర ద్వారా మంగళ గౌరీ వ్రతాన్ని అమ్మ వ్యాపింపచేసింది. ఈ వ్రతం చేసిన వారింట్లో గౌరీ దేవి కొలువై ఉంటుంది. స్త్రీలకు శాశ్వతంగా ముత్తైదువగా ఉండే వరాన్నిస్తుంది.
చేయవలిసిన విధులు:
1) కొత్త పెళ్లి కూతురు తప్పనిసరిగా శ్రావణ మంగళవార నోము నోచుకోవాలి.
2) పెళ్ళైన దగ్గరినుండి ఐదేళ్లు విడిచిపెట్టకుండా చేసుకోవాలి.
3) గణపతిని పూజించాలి తరువాత మళ్ళీ శుభ్రవస్త్రం ధరించాలి. మంగళ గౌరి వ్రతమునకు కట్టుకొన్న వస్త్రాలను మళ్ళీ మరొక వ్రతమునకు వాడకూడదు.
4) నాలుగు శేర్లకు తక్కువ కాకుండా శనగలు ఉదయన్నే నానబెట్టాలి.
5) మంగళవారం అమ్మను పూజించాలి. గౌరీ దేవికి షోడశోపచారాలు చేయాలి, వ్రత కథ చదవాలి, అమ్మని భక్తితో పూజించాలి. సాయంత్రం లేదా పూజ అనంతరం పగలు కానీ శనగలు వాయనం ఇవ్వాలి. ముత్తైదువులకు పసుపు, గంధం పూసి తమలపాకులు, వక్కలు, అరటి పండ్లు, గాజులు, వస్త్రములతో తాంబూలం ఇవ్వాలి.
6) నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి తో దీపం వెలిగించాలి, బాగా పొగ వచ్చేటట్టు చేసి ఇనుప గరిట పెట్టి కాటుక పట్టాలి. ఆ కాటుకను తాము పెట్టుకొని ముత్తైదువలకు ఇవ్వాలి.
7) తాజా ఆవు నెయ్యినే వాడాలి, తాజా ఆవు నెయ్యి దొరకనప్పుడు తాజా నువ్వుల నునె మాత్రమే కాటుక పట్టడానికి వాడాలి.
8) గురు దంపతులను, పెద్ద దంపతులను పూజించాలి.
9) ఈ వ్రతం చేసిన వారికి అమ్మ అనుగ్రహం వల్ల చర్మమునుకు సంబంధించిన రోగాలు పోయి కాంతివంతం అవుతుంది.
మంగళ గౌరీ వ్రత విశేషాలు👇🏻
https://youtube.com/shorts/3rNCnQTtID4?si=eDA4qrMkBA4S5pt3
శ్రీ సూక్తం👇🏻
https://youtu.be/QBQNDt0i-_8?si=CfsUF4aTgByIvQgQ
శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రం👇🏻
https://youtu.be/FNh6oGn-k8w?si=Ok5tfotDGbThLN7b
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial