Aug 15 2026ఆగష్టు 15 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 15 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల పక్షం

తిథి: తదియ రా.7.31 కు తదుపరి చతుర్థి 16 రా.7.00 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: పుబ్బ ఉ.6.25 కు తదుపరి ఉత్తర 16 ఉ.6.22 కు
యోగం: శివ ఉ.7:08 కు తదుపరి సిద్ధ 16 తె.5:20 కు
కరణం: తైతుల ఉ.6:03 కు, గరజి సా.5:29 కు తదుపరి వణిజ 16 తె.5:05 కు
రాహుకాలం:
ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం:
ఉ. 7.43 - 8.34 కు
వర్జ్యం:
మ.1.36 - 3.11 కు
అమృతకాలం:
రా. 08.17 - 09.52 కు
సూర్యోదయం:
ఉ. 6.02 కు
సూర్యాస్తమయం:
సా. 6.38 కు

గురుబోధ:*
🕉️మన దేశసంరక్షణ, ధర్మపరిరక్షణ మన అందరి బాధ్యత. ప్రతిదినం కనీసం రెండు ని౹౹లు అయినా లోకకల్యాణార్థం స్తోత్ర పారాయణము, జపము లేదా భగవన్నామమో ప్రతి ఒక్కరూ చేయాలి.
🕉️గో, దేశ, ధర్మసంరక్షణ చేసే వారి వెంట భగవంతుడు ఉంటాడు. మహాభారతంలో దుష్టబుద్ధి గల కౌరవులు విరాటరాజ్యంలో ఉన్నగోవులని అపహరిస్తారు. వాటిని రక్షించడానికి అర్జునుడు ఒక్కడే ఉత్తర గోగ్రహణం లో కౌరవ సైన్యం లో ఉన్న వీరులను, సైన్యాన్ని అందరిని ఒక్కపూట లో జయించాడు. అదే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను జయించడానికి 18 రోజులు పట్టింది. కారణం అర్జునుడు ఉత్తర గోగ్రహణంలో కౌరవులతో యుద్ధం చేసింది గోవులను రక్షించడానికి, కానీ కురుక్షేత్రంలో యుద్ధం చేసింది వారి రాజ్యాన్ని వారు పొందడానికి. గోవుల కోసం, దేశ సంరక్షణ కోసం, ధర్మం కోసం పోరాటం చేస్తే మనకు తెలియకుండానే భగవంతుడు మనకు అన్నీ కార్యాలు సులభము చేస్తాడు.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less