కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 14 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల పక్షం
తిథి: విదియ రా.8.31 కు తదుపరి తదియ 15 రా.7.31 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: మఘ ఉ.6.55 కు తదుపరి పుబ్బ15 ఉ.6.25 కు
యోగం: పరిఘ ఉ.9:28 కు తదుపరి శివ 15 ఉ.7:08 కు
కరణం: బాలవ ఉ.7:40 కు తదుపరి కౌలవ సా 6:47 కు, తైతుల 15 ఉ.6:03 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 8.34 - 9.24 కు, మ. 12.46 - 1.36 కు
వర్జ్యం: మ.2.45 - 4.19 కు
అమృతకాలం: సా. 09.56 - 11.28 కు
సూర్యోదయం: ఉ. 6.02 కు
సూర్యాస్తమయం: సా. 6.39 కు
🕉️ శ్రావణశుక్ల ద్వితీయ, మొదటి శ్రావణ శుక్రవారం 🕉️
గురుబోధ:
🕉️ఇల్లు శుభ్రంగా ఉంచుకోకపోతే లక్ష్మీ దేవి ఆ ఇంటిలో ఉండదు.
🕉️ఒకసారి కట్టి విడిచిన బట్టలు ఉతకకుండా మళ్ళీ కట్టరాదు. అలా కడితే లక్ష్మీదేవి వారిని విడిచిపెడుతుంది.
🕉️అగస్త్యుడు, లోపాముద్రాసమేతంగా కరవీరపురం (కోలాపురం/కొల్హాపురం) చేరి మంగళదేవత, మంగళస్వరూపిణి, విష్ణువు యొక్క హృదయపద్మంలో ఉంటూ తెల్లని, బంగారురంగుతో ఉండే శ్రీమహాలక్ష్మిని చేసిన గొప్ప స్తోత్రం. ఈ స్తోత్రాన్ని భక్తిశ్రద్ధలతో విన్నవారు ఎంత దరిద్రులైనా ఐశ్వర్యవంతులవుతారు. ఒక 40 రోజులు విడిచిపెట్టకుండా చదివినా, శ్రవణం చేసినా వారి ఇంట్లో నేను కొలువై ఉంటాను అని శ్రీ మహలక్ష్మీదేవి వరమిచ్చింది.
అగస్త్యకృత మహాలక్ష్మీస్తోత్రం👇
https://youtu.be/yUXkM_QhZgA?si=9dFYGF4uMJ5CwU7H
శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం👇
https://youtu.be/FNh6oGn-k8w?si=P89gsD4e4yjlgZHp
శ్రీ సూక్తం👇
https://youtu.be/QBQNDt0i-_8?si=_SdKDrd-ArN_1I2f
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial