కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 12 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము కృష్ణ పక్షం
తిథి: అమావాస్య రా.11.41 కు తదుపరి శ్రావణ శు.పాడ్యమి 13 రా.9.55 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: పుష్యమి ఉ.9.00 కు తదుపరి ఆశ్లేష 13 ఉ.7.48 కు
యోగం: వ్యతీపాత మ.03:25 కు తదుపరి వరీయాన్ 13 మ.12:15 కు
కరణం: చతుష్పాద మ.12:27 కు, నాగ రా.11:06 కు తదుపరి బవ 13 రా.8:42 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.55 - 12.46 కు
వర్జ్యం: రా.9.09 - 10.41 కు
అమృతకాలం: తె. 02.09 - 03.36 కు
సూర్యోదయం: ఉ. 6.02 కు
సూర్యాస్తమయం: సా. 6.40 కు
🕉️ ఆషాఢ అమావాస్య 🕉️
గురుబోధ:*
ఎప్పుడూ అమావాస్యనాడు తలంటి మాత్రం పోసుకోకూడదు. ఈ పూట అభ్యంగనం పనికిరాదు. కేవలం శిరస్నానం చేస్తే చాలు. స్నానం చేసిన తరువాత ఒక పెద్ద రాగి గిన్నె కానీ, ఇత్తడి గిన్నె కానీ, కంచు గిన్నె కానీ లేదా మట్టి మూకుడు కానీ పెట్టుకుని అందులో నిండా నీళ్లు తీసుకోండి, ఆ నీటిలో ఎర్రని పూలు, నల్లని పూలు, పసుపుపచ్చ పూలు వేయండి. ఈ పువ్వులు, నీళ్లు కలిపి రెండు చేతులలో (దోసిలి) తీసుకొని మీ పితృదేవతలకు మూడు సార్లు వాళ్లను మనసారా తలుచుకొని అర్ఘ్యం విడిచిపెట్టండి (నీళ్లు విడిచిపెట్టేయండి). ఏదైనా వేరే పాత్రలో ఆ నీళ్లు పోసేయ్యండి. ఇక్కడ అమ్మకి నాన్నకి కాదు మీరు విడిచిపెట్టేది, మీ వంశాన్ని బాగు చేస్తున్న మహానుభావులైన పితృదేవతలకు, కాబట్టి అందరం ఆడ, మగ అనే తేడా లేకుండా తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా ఈ తర్పణములు మాత్రం విడిచిపెట్టాలి. పిండప్రదానాలు మాత్రం తల్లిదండ్రులు ఉన్న వాళ్లు చెయ్యకూడదు తప్ప తర్పణములు అందరూ ఇవ్వాలి. ఈ విధముగా అమావాస్య తర్పణములు విడిచిపెట్టాక యథాశక్తిగా ఇష్టదేవతలను పూజించండి. సూర్యుడిని మాత్రం తప్పక పూజించండి. వీలుంటే నవగ్రహాలను తలచుకోండి, నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి, నవగ్రహాలకు పూజ చేయండి.
పితృదేవతా స్తోత్రం - https://youtu.be/UgnxFM4YHYY?si=D2PEnY6wqA76XeTZ
PDF - https://srivaddipartipadmakar.org/stotram/pitrudevata-stotram-final-sep2020/
శ్రీ శివ కేశవ అష్టోత్తరం - https://youtu.be/1MoC79bhXT0?si=9KJsRM5AVHan6RnX
PDF - https://srivaddipartipadmakar.org/stotram/sri-sivakesava-ashtothara-shatanamavali-yamadharmaraja-kritham/
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial