June 27 2026జూన్ 27 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 27 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసము శుక్ల పక్షం

తిథి: త్రయెదశి రా.12.28 కు తదుపరి చతుర్దశి 28 రా.2.25 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: అనూరాధ రా.10.43 కు తదుపరి జ్యేష్ఠ 28 రా.1.17 కు
యోగం: శుభ మ.1:29 కు తదుపరి శుక్ల 28 మ.2:25 కు
కరణం: తైతుల రా.12:43 కు తదుపరి గరజి 28 మ.1:55 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ. 7.32 - 8.24 కు
వర్జ్యం: తె.4.55 - 28 ఉ.6.41 కు
అమృతకాలం: ఉ. 10.29 - 12.17 కు
సూర్యోదయం: ఉ. 5.48 కు
సూర్యాస్తమయం: సా. 6.50 కు

🕉️ శని త్రయోదశి, శని ప్రదోషం 🕉️

గురుబోధ:
శ్లో|| అదాన దోషేణ భవేత్ దరిద్రః, దరిద్ర దోషేణ కరోతి పాపమ్ |
పాపాదవశ్యం నరకం ప్రయాతి, పునర్దరిద్రః పునరేవ పాపీ ||
దానం చేయని దోషం వల్ల మానవుడు దరిద్రుడై జన్మిస్తాడు. ఈనాటి మన దారిద్ర్యానికి మూలకారణం ఏనాడూ ఎవరికీ దానం చేయకపోవడమే. దరిద్రత వల్ల బ్రతకడానికి ఏదో ఒక పాపం చెయ్యక తప్పదు. పాపం వల్లఈ నరకం తప్పదు. నరకం నుండి తిరిగి భూలోకంలో దరిద్రుడిగా పుడతాడు జీవి. మరల పాపపు బ్రతుకు తప్పదు. ఈ చక్రం నుండి విముక్తి పొందడానికి గురుకటాక్షం కావలసిందే. జ్యేష్ఠ మాసం లోని శుక్ల త్రయోదశీ తిథిని దౌర్భాగ్యశమనతిథి అంటారు. ఈ రోజు ఏదైనా నదిలో కాని, ప్రవాహ జలంలో కాని స్నానం చేసి తెల్లమందారం, జిల్లేడు, ఎఱ్ఱగన్నేరు పూలను ఒక పళ్ళెంలో ఉంచాలి. ఆపై సూర్యుని కేసి చూస్తూ పూలను తాకి నమస్కరించాలి. ఈ క్రింది శ్లోకం పఠించాలి.
శ్లో|| మందార కరవీరార్కః భవంతో భాస్కరాంశజాః |
పూజితా మమదౌర్భాగ్యం, నాశయంతు నమోస్తువః ||
"మందారమా! గన్నేరుపూవా! జిల్లేడుపూవా! మీరు సూర్యుని అంశతో జన్మించారు. మా పూజలందుకొని మా దౌర్భాగ్యం తొలగించండి. మీకు నమస్కారం" అని ఈ శ్లోకానికి అర్థం. ఇలా పూజించిన వారి దౌర్భాగ్యాలన్నీ తొలగిపోతాయి. సంపదలు, మనీషాసంపదలు లభిస్తాయి. మనం చేసే దానధర్మములు, పురాణశ్రవణము, తీర్థయాత్రాఫలితాలు మనలని, మన పిల్లలని, మన వంశాన్ని కూడా తరింపచేస్తాయి.
⚡ శనివారం త్రయోదశి వస్తే దానిని శనిత్రయోదశి అంటారు. ఆ రోజు శనైశ్చరునికి, హనుమంతునికి లేదా గణపతికి చేసే పూజల వల్ల శని అనుగ్రహం పొంది కష్టాల నుండి త్వరగా బయట పడుతారు
శనైశ్చరుడు సాక్షాత్ సూర్యభగవానుని పుత్రుడు, కరుణా స్వరూపుడు. కాశీలో గొప్ప తపస్సు చేసి శివ అనుగ్రహంతో గ్రహాధిపతి అయ్యాడు. ధర్మప్రియుడు. అధర్మం చేసేవారిని శిక్షిస్తాడు.
నిత్యం నవగ్రహ ప్రదక్షిణ ఎంతో మంచిది. నవగ్రహాలను ఎప్పుడూ తక్కువ చేయరాదు. వారు గొప్ప తపస్సు చేసి గ్రహాధిపత్యం పొందారు. కేవలం శనికి తైలాభిషేకం చేస్తే తప్ప నవ గ్రహాల చుట్టూ ప్రదక్షిణ అయ్యాక కాళ్లు కడుక్కోవడం ఏ శాస్త్రం లో చెప్పలేదు.
⚡దేవాలయాల్లో మూర్తులకు ముఖ్యంగా శనైశ్చరునికి ఎదురుగా నిలబడరాదు. ప్రక్కనుండి మాత్రమే నమస్కారం చెయాలి.
సిందూరం లేదా తమలపాకులతో హనుమంతుని పూజించడం, శనికి నువ్వుల నూనెతో అభిషేకం, బెల్లం నువ్వులు నైవేద్యం పెట్టడం, నల్లని వస్త్రం ఇవ్వడం మరియు నిత్యం ఈ శ్లోక పారాయణ వల్ల శుభ ఫలితాలు పొందుతాం.
శ్లో|| కోణం నీలాంజన ప్రఖ్యం మంద చేష్టా ప్రసారిణం ఛాయా  మార్తాండ  సంభూతం, నమస్యామి శనైశ్చరం
శనిప్రదోషం - శివ పూజా ఫలితం!
⚡ప్రదోష సమయంలో శివ దర్శనం, అభిషేకము చాలా విశేషం. సకల కోరికలు తీరుతాయి.
⚡శనిప్రదోష పూజా ఫలితంగా శ్రీ అనసూయ అత్రి మహర్షికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారు; శ్రీ సుమతి, శ్రీ అప్పలరాజులకి శ్రీ పాద శ్రీ వల్లభులు జన్మించారు.
ఈ రోజు నవగ్రహాలకు 108 ప్రదక్షిణలు చేయడం మంచిది.
⚡ గాణగాపురం శ్రీ నృసింహ సరస్వతీ స్వామి వారు కూడా శనిప్రదోష పూజా ఫలితంగా వారి తల్లిదండ్రులకు జన్మించారు.

పిప్పలాద ప్రోక్త శని స్తోత్రం👇
https://youtu.be/97Q4_4k_hH4?si=ZrxR8HLZ8tWhhP77
PDF - https://srivaddipartipadmakar.org/stotram/pippaladakruta-sri-sani-stotram/pcatid/108/
శ్రీ శని స్తోత్రం (దశరథ కృతం)👇
https://youtu.be/41P8HbBhQAs?si=I8piaWgDoTC4asIB
PDF - https://srivaddipartipadmakar.org/stotram/shani-stotram-by-dasaratha-padma-purana/pcatid/108/
ఏలినాటి శని తొలగించే కథ👇
https://youtu.be/DZTHb0mK6hM?si=U87crLSe9heMKRpa

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less