కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 21 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసము శుక్ల పక్షం
తిథి: సప్తమి రా.8.07 కు తదుపరి అష్టమి 22 రా.7.40 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: పుబ్బ మ.2.40 కు తదుపరి ఉత్తర 22 మ.2.50 కు
యోగం: వ్యతీపాత ఉ.10:30 కు తదుపరి వరీయాన్ 22 ఉ.10:13 కు
కరణం: వణిజ మ.3:21 కు తదుపరి బవ 22 మ.3:40 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: మ. 5.04 - 5.56 కు
వర్జ్యం: రా.9.55 - 11.32 కు
అమృతకాలం: తె. 02.54 - 04.33 కు
సూర్యోదయం: ఉ. 5.46 కు
సూర్యాస్తమయం: సా. 6.48 కు
🕉️ నిజ జ్యేష్ఠమాస శుక్లపక్ష సప్తమీతిథి : భానుసప్తమి 🕉️
గురుబోధ:
ప్రతి మాసంలో వచ్చే శుక్లపక్ష సప్తమి నాడు చేసే ఈ వ్రతం అమోఘమైన ఫలితాలను ఇస్తుంది:
🌸 వ్రత విధానం:
🌅 అర్ఘ్య ప్రదానం: ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో ఎఱ్ఱని పుష్పాలతో, సూర్యునికి ఇష్టమైన స్తోత్రాలు పఠిస్తూ అర్ఘ్యం ఇవ్వాలి.
ఉపవాస దీక్ష: రోజంతా ఉపవాస దీక్షను ఆచరించాలి.
మంత్ర జపం: సూర్య సంబంధిత మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు జపించడం ద్వారా సూర్యభగవానుడు దివ్యమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు.
స్వయంపాక దానం:
ఈ పవిత్ర దినాన బ్రాహ్మణోత్తములకు బియ్యం, కూరగాయలు స్వయంపాకంగా దానం ఇవ్వడం వల్ల సర్వపాపాలు తొలగిపోతాయి.
ఈ వ్రత ప్రభావంతో ధనప్రాప్తి, సంతాన ప్రాప్తి మరియు సకల శుభాలు కలుగుతాయి.
ఈ శుక్లపక్ష సప్తమీ వ్రత ఫలితాన్ని ఆ సూర్యభగవానుడు, ఆదిశేషుడు కూడా వర్ణించలేరు!
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial