June 11 2026జూన్ 11 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 11 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం

తిథి: ఏకాదశి సా.6.10 కు తదుపరి ద్వాదశి 12 సా.4.13 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: అశ్విని 12 తె.3.08 కు తదుపరి భరణి 12 రా.1.51 కు
యోగం: శోభన రా.12:59 కు తదుపరి అతిగండ 12 రా.9:25 కు
కరణం: బవ ఉ.11:52 కు, బాలవ రా.10:36 కు తదుపరి తైతుల 12 రా.7:37 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.05 - 10.57 కు, మ. 3.17 - 4.09 కు
వర్జ్యం: ప.11.17 - 12.49 కు
అమృతకాలం: తె. 05.58 - 07.30 కు తదుపరి రా. 11.48 - 01.17 కు
సూర్యోదయం: ఉ. 5.45 కు
సూర్యాస్తమయం: సా. 6.46 కు

🕉️ కృష్ణ పక్ష ఏకాదశి 🕉️

ఏకాదశీ ఉపవాసం ఈరోజు ఉండాలి. ద్వాదశీ పారణ రేపు చేయాలి.

గురుబోధ:
🕉️ఏకాదశికి హరివాసరమని పేరు, విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన తిథి.
🕉️ఏకాదశి అంటే హరిహరులకు ప్రీతి. ఏకాదశి అనే మాట వింటేనే యమకింకరులు వణికిపోతారు.
🕉️అధికమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని "కమలా" అని అంటారు. 3 సంవత్సరాల పాటు అధికమాసాలలో వచ్చే ఏకాదశీ వ్రతం చేసేవారు ముక్కోటి దేవతలు పొందే వైభవం పొందుతారు.
🕉️అన్ని ఏకాదశుల కన్నా అధికమాసంలో వచ్చే ఏకాదాశులలో చేసే ఉపవాసం, హరిసంకీర్తనకు ఎక్కువ ఫలితం ఉంటుంది. అందుకే దేవతలు కూడా అధిక మాసములలో వచ్చే ఏకాదశుల కోసం ఎదురుచూస్తుంటారు.
🕉️కలియుగములో కటిక ఉపవాసము నిషిద్ధము కనుక శరీరము నిలబడుటకు కావలసిన రీతిలో పండుకానీ, పాలు కానీ, అల్పాహారం తీసుకుని ఉపవాసం చేయాలి.
🕉️నిజ మాసములో వచ్చే పితృకార్యములు (శ్రాద్ధములు), పండుగలు, పుట్టినరోజుల వంటివి అధిక మాసములో కూడా తప్పక చేయాలని శాస్త్రం.

https://youtu.be/IDynY99FO_w?si=-BMmsGnNqgNnFckN

వాసుదేవ స్తోత్రం👇
https://youtu.be/J658-6zYEPg?si=uHMs6KIuy_Tuj2M2
PDF - https://srivaddipartipadmakar.org/stotram/sri-vasudeva-stotram-padma-puranam/pcatid/108/
వాసుదేవ శతనామాలు👇
https://youtu.be/DpjBm71jA_s?si=8PQyYqAKImZE7o8h
PDF - https://srivaddipartipadmakar.org/stotram/sri-vasudeva-satanaamaavali/pcatid/108/

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

expand_less