కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 10 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం
తిథి: దశమి రా.7.47 కు తదుపరి ఏకాదశి 11 సా.6.10 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: రేవతి 11 తె.4.06 కు తదుపరి అశ్విని 12 తె.3.08 కు
యోగం: సౌభాగ్య 11 తె.4:02 కు తదుపరి శోభన 12 రా.12:59 కు
కరణం: వణిజ మ.1:52 కు తదుపరి బవ 11 ఉ.11:52 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.49 - 12.41 కు
వర్జ్యం: సా.4.25 - 5.58 కు
అమృతకాలం: తె. 04.35 - 06.10 కు
సూర్యోదయం: ఉ. 5.45 కు
సూర్యాస్తమయం: సా. 6.45 కు
గురుబోధ:
మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ తమకోసము లేదా తమ ప్రీతిపాత్రులైన వారి కోసం ఈ దశదానములు తప్పక చేయాలని శాస్త్రం. అన్నీ చేయలేకపోతే స్తోమత బట్టి వాటిలో కొన్ని అయినా చేయాలని శాస్త్రము.
శ్లో౹౹ గోభూతిల హిరణ్యాజ్య వాసోధాన్య గుడాస్తథా
రజతం లవణం చైవ దానాని దశవై విదుః ౹౹ - గరుడపురాణం(ధర్మకాండము)
1. గోవులు 2. భూమి 3. తిలలు 4. హిరణ్యం 5. ఘృతము 6. వస్త్రం 7. ధాన్యం 8. బెల్లం 9. వెండి 10. ఉప్పు
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial