June 01 2026జూన్ 01 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జూన్ 01 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసము కృష్ణ పక్షం

తిథి: బ.పాడ్యమి మ.2.52 కు తదుపరి విదియ 2 సా.4.52 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: జ్యేష్ఠ సా.5.56 కు తదుపరి మూల 2 రా.8.31 కు
యోగం: సాధ్య ఉ.7:15 కు తదుపరి శుభ 2 ఉ.8:11 కు
కరణం: కౌలవ సా.4:37 కు తదుపరి గరజి 2 రా.7:01 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.39 - 1.31 కు, మ. 3.15 - 4.07 కు
వర్జ్యం: రా.2.48 - 4.34 కు
అమృతకాలం: ఉ. 09.14 - 11.02 కు
సూర్యోదయం: ఉ. 5.45 కు
సూర్యాస్తమయం: సా. 6.42 కు

గురుబోధ:
ఎన్నో వేలజన్మల సంస్కారం, పుణ్యం ఉంటే గాని తీర్థయాత్రలు చేయలేము. పైగా సద్గురువులతో యాత్ర చేసే భాగ్యం మరింత అదృష్టం. అటువంటి పుణ్య ప్రదేశాలలో ఇతరుల పై చాడీలు చెప్పడం, కోపగించుకోవడం, ఏదో ఒక వంక పెట్టి అసంతృప్తి వ్యక్తపరచడం, విరుచుకుపడడం చేయరాదు. సాధ్యమైనంత వరకు ఏదో ఒక నామ, జప, పారాయణం, పురాణ శ్రవణంతో కాలం గడపాలి.
తీర్థయాత్రలు చేయడం కుదరనప్పుడు తీర్థయాత్రలు చేసేవారికి ధన, వస్తు రూపములో ఎంతో కొంత సహాయం చేసినవారికి కూడా ఆ తీర్థయాత్రలు చేసిన ఫలితం కొంత వస్తుంది.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less