కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 27 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసము శుక్ల పక్షం
తిథి: ఏకాదశి ఉ.7.51 కు తదుపరి ద్వాదశి 28 ఉ.8.28 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: హస్త ఉ.7.42 కు తదుపరి చిత్ర 28 ఉ.9.00 కు
యోగం: వ్యతీపాత 28 తె.3:24 కు తదుపరి వరీయాన్ 29 తె.3:54 కు
కరణం: బవ రా.7:07 కు తదుపరి కౌలవ 28 రా.8:52 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.47 - 12.39 కు
వర్జ్యం: సా.4.08 - 5.49 కు
అమృతకాలం: రా. 01.07 - 02.52 కు
సూర్యోదయం: ఉ. 5.45 కు
సూర్యాస్తమయం: సా. 6.41 కు
🕉️ అధిక జ్యేష్ఠ శుక్లపక్ష ఏకాదశి 🕉️
ఏకాదశీ ఉపవాసం ఈరోజు ఉండాలి. ద్వాదశీ పారణ రేపు ఉదయం 8 గం.ల లోపు చేసెయ్యాలి.
గురుబోధ:
🕉️ఏకాదశికి హరివాసరమని పేరు, విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన తిథి.
🕉️ఏకాదశి అంటే హరిహరులకు ప్రీతి. ఏకాదశి అనే మాట వింటేనే యమకింకరులు వణికిపోతారు.
🕉️అధికమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని "కామదా" అని అంటారు. ధర్మబద్ధమైన కోరికలు తీర్చే ఏకాదశి ఇది. 3 సంవత్సరాల పాటు అధికమాసాలలో వచ్చే ఏకాదశీ వ్రతం చేసేవారు ముక్కోటి దేవతలు పొందే వైభవం పొందుతారు.
🕉️అన్ని ఏకాదశుల కన్నా అధికమాసంలో వచ్చే ఏకాదాశులలో చేసే ఉపవాసం, హరిసంకీర్తనకు ఎక్కువ ఫలితం ఉంటుంది. అందుకే దేవతలు కూడా అధిక మాసములలో వచ్చే ఏకాదశుల కోసం ఎదురుచూస్తుంటారు.
🕉️కలియుగములో కటిక ఉపవాసము నిషిద్ధము కనుక శరీరము నిలబడుటకు కావలసిన రీతిలో పండుకానీ, పాలు కానీ, అల్పాహారం తీసుకుని ఉపవాసం చేయండి.
🕉️నిజ మాసములో వచ్చే పితృకార్యములు (శ్రాద్ధములు), పండుగలు, పుట్టినరోజుల వంటివి అధిక మాసములో కూడా తప్పక చేయాలని శాస్త్రం.
https://youtu.be/tKiySwvOcaI?si=tAsX6pSJqO90sMFR
వాసుదేవ స్తోత్రం👇
https://youtu.be/J658-6zYEPg?si=uHMs6KIuy_Tuj2M2
PDF - https://srivaddipartipadmakar.org/stotram/sri-vasudeva-stotram-padma-puranam/pcatid/108/
వాసుదేవ శతనామాలు👇
https://youtu.be/DpjBm71jA_s?si=8PQyYqAKImZE7o8h
PDF - https://srivaddipartipadmakar.org/stotram/sri-vasudeva-satanaamaavali/pcatid/108/
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial