కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 11 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణ పక్షం
తిథి: నవమి ఉ.10.16 కు తదుపరి దశమి 12 ఉ.9.54 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: శతభిషం రా.8.55 కు తదుపరి పూర్వాభాద్ర 12 రా.9.03 కు
యోగం: ఐంద్ర రా.1:04 కు తదుపరి వైధృతి 12 రా.11:19 కు
కరణం: గరజి మ.3:25 కు తదుపరి విష్టి 12 మ.2:52 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.38 - 1.29 కు, మ. 3.11 - 4.02 కు
వర్జ్యం: తె.3.21 - 4.58 కు
అమృతకాలం: సా. 06.04 - 07.42 కు
సూర్యోదయం: ఉ. 5.49 కు
సూర్యాస్తమయం: సా. 6.35 కు
గురుబోధ:
భక్తులంతా ఈ క్రిందిశ్లోకాన్ని నిరంతరం తలుచుకోండి, వీలున్నప్పుడల్లా జపం చేయండి.
శ్లో|| బుద్ధిః బలం యశో ధైర్యం నిర్భయత్వం, అరోగతా |
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్||
🕉️ఇది ఒక అద్భుతమైన శ్లోకం. బుద్ధి, బలం, కీర్తి, మనస్సులో కలతలేకుండుట, భయం లేకుండుట, రోగం లేకుండుట, చురుకుదనం, ఉపన్యాస పటుత్వం, ఇవన్నీ హనుమస్మరణ వల్ల జీవులకు కలుగుతాయి.
🕉️ఇది వాల్మీకి మహర్షి రచించిన శ్లోకం కాదు. పరాశరుడు ఆంజనేయుని భక్తుడు, హనుమంతుని చరిత్రను పరాశరసంహిత అనే పేరుతో గ్రంథంగా రాసిన మహానుభావుడు. ఆయన అందించిన గొప్ప శ్లోకము ఇది. హనుమంతుడు భారతీయ కాలమానం ప్రకారము వైశాఖ మాసం , కృష్ణ పక్షం, దశమీ తిథి నాడు జన్మించాడు. ఆనాడు శనివారం కూడా కలసి వచ్చింది. వైశాఖే మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే అని పరాశరసంహిత వంటి గ్రంథాలు, మంత్ర శాస్త్రాలు కూడా చెపుతున్నాయి.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial