కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 09 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణ పక్షం
తిథి: సప్తమి ఉ.9.27 కు తదుపరి అష్టమి 10 ఉ.10.06 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: శ్రవణం రా.7.11 కు తదుపరి ధనిష్ఠ 10 రా.8.18 కు
యోగం: శుక్ల రా.2:35 కు తదుపరి బ్రహ్మ 10 రా.2:08 కు
కరణం: బవ మ.2:03 కు తదుపరి కౌలవ 10 మ.3:07 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ. 7.32 - 8.23 కు
వర్జ్యం: రా.11.22 - 1.02 కు
అమృతకాలం: మ. 12.23 - 02.08 కు
సూర్యోదయం: ఉ. 5.50 కు
సూర్యాస్తమయం: సా. 6.34 కు
🕉️ మహారాణాప్రతాప్ జయంతి🕉️
గురుబోధ:
పురాణం వినడం ఎంతో పుణ్యం. ఆ వినిన పురాణమును ఇతరులకు చెప్పడం పది రెట్ల ఫలితం మఱియు పురాణమును మననం చేయడం వల్ల వంద రెట్ల ఫలితం వస్తుంది. పురాణము వినమని ఇతరులను ప్రేరేపించడం వలన వెయ్యి రెట్ల ఫలితం వస్తుంది.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial