కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 29 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము శుక్ల పక్షం
తిథి: త్రయోదశి రా.7.43 కు తదుపరి చతుర్దశి 30 రా.8.12 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: హస్త రా.12.14 కు తదుపరి చిత్ర 30 రా.1.36 కు
యోగం: వజ్ర రా.8:54 కు తదుపరి సిద్ధి 30 రా.9:13 కు
కరణం: తైతుల రా.7:52 కు తదుపరి వణిజ 30 రా.9:13 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.48 - 12.38 కు
వర్జ్యం: ఉ.8.03 - 9.43 కు
అమృతకాలం: సా. 05.50 - 07.32 కు
సూర్యోదయం: ఉ. 5.55 కు
సూర్యాస్తమయం: సా. 6.31 కు
🕉️ ప్రదోషం🕉️
గురుబోధ:
🕉️ప్రదోషవేళ చేసే శివారాధన, శివపూజ, శివాభిషేకం విశేషమైన శివానుగ్రహాన్ని ప్రసాదిస్తుంది.
🕉️ఉదయం పూట, మధ్యాహ్నానికి కొంచెం ముందు శివలింగ దర్శనం అత్యంత శుభప్రదం. సూర్యోదయానికి ముందు 20ని.లు, సూర్యాస్తమయం తరువాత 20 ని.లు ఈ కాలాన్ని ప్రదోషకాలము అంటారు. ఆ సమయంలో శివదర్శనం, శివారాధన, శివ పూజ, శివాభిషేకము, జపము చాలా విశేషమైనది, చేసుకొన్నవాడికి పునర్జన్మ ఉండదు. శివాలయంలో శివలింగం బయట కాని ఆలయ గోపురంపై కాని శివవిగ్రహం ఉంటే, ఆ ఆలయంలో పూజాదికాలు నిర్వహించినవారికి శివపదం వస్తుంది. శివలింగం యొక్క పీఠం లేక పానవట్టం అమ్మవారు. శివలింగం చేతనాత్మకమైన శివస్వరూపం. పానవట్టంతో కూడిన శివలింగం పార్వతీపరమేశ్వరుల ఐక్యరూపం.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial