March 22 2026మార్చి 22 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 22 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము శుక్ల పక్షం

తిథి: చతుర్థి రా.12.08 కు తదుపరి పంచమి 23 రా.9.49 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: భరణి రా.1.33 కు తదుపరి కృత్తిక 23 రా.11.58 కు
యోగం: విష్కంభ మ.12:21 కు తదుపరి ప్రీతి 23 ఉ.9:07 కు
కరణం: విష్టి రా.9:17 కు తదుపరి బాలవ 23 సా.6:38 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా.4.47 - 5.35 కు
వర్జ్యం: మ.12.00 - 1.30 కు
అమృతకాలం: సా. 06.42 - 08.11 కు
సూర్యోదయం: ఉ. 6.22 కు
సూర్యాస్తమయం: సా. 6.23 కు

గురుబోధ:
🕉️అష్టాదశ పురాణములు, రామాయణం , శ్రీ మద్భాగవతం, మహాభారతం వంటి పురాణములు వింటే వచ్చే పుణ్యం మనలని మన ముందు తరాలని, మన తరువాతి తరాలని కూడా రక్షిస్తుంది.
🕉️కేవలం దేవాలయం దర్శనానికి వెళ్ళడమే కాకుండా ఆలయ నిర్వహణకు కావల్సిన కనీస సదుపాయాలు అందించడం, ఆలయం శుభ్రపరచడం మొ|| చేయడం ఎన్నో శుభఫలితాలను ప్రసాదిస్తుంది, భగవంతుని సంతోషపరుస్తుంది, వచ్చే జన్మలు ఉత్తమజన్మలు వచ్చేలా చేస్తుంది. ధర్మరాజాదులు సైతం ఆలయసేవ చేసారని మనకు పురాణాలు చెపుతున్నాయి.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less