కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 16 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాసము కృష్ణ పక్షం
తిథి: ద్వాదశి ఉ.7.58 కు తదుపరి త్రయోదశి 17 ఉ.8.11 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: ధనిష్ఠ 17 తె.5.17 కు తదుపరి శతభిషం 18 తె.5.40 కు
యోగం: సిద్ధ ఉ.8:14 కు తదుపరి సాధ్య 17 ఉ.6:21 కు
కరణం: గరజి రా.9:37 కు తదుపరి విష్టి 17 రా.8:59 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ.12.48 - 1.36 కు, మ. 3.11 - 3.59 కు
వర్జ్యం: ఉ.8.32 - 10.12 కు
అమృతకాలం: రా. 07.46 - 09.23 కు
సూర్యోదయం: ఉ. 6.27 కు
సూర్యాస్తమయం: సా. 6.22 కు
🕉️ సోమప్రదోషము 🕉️
గురుబోధ:
🕉️శివాలయంలో శివలింగం బయట కాని, ఆలయ గోపురంపై కాని శివవిగ్రహం ఉంటే, ఆ ఆలయంలో పూజాదికాలు నిర్వహించినవారికి శివపదం వస్తుంది. శివలింగం యొక్క పీఠం లేక పానవట్టం అమ్మవారు. శివలింగం చేతనాత్మకమైన శివస్వరూపం. పానవట్టంతో కూడిన శివలింగం పార్వతీపరమేశ్వరుల ఐక్యరూపం.
🕉️ఉదయం పూట, మధ్యాహ్నానికి కొంచెం ముందు శివలింగ దర్శనం అత్యంత శుభప్రదం. సూర్యోదయానికి ముందు 20ని.లు, సూర్యాస్తమయం తరువాత 20 ని.లు ఈ కాలాన్ని ప్రదోషకాలము అంటారు. ఆ సమయంలో శివదర్శనం, శివారాధన, శివపూజ, శివాభిషేకము, జపము చాలా విశేషమైనది,చేసుకొన్నవారికి పునర్జన్మ ఉండదు.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial