కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 10 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాసము కృష్ణ పక్షం
తిథి: సప్తమి రా.12.19 కు తదుపరి అష్టమి 11 రా.2.24 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: అనూరాధ సా.5.55 కు తదుపరి జ్యేష్ఠ 11 రా.8.31 కు
యోగం: వజ్ర ఉ.9:11 కు తదుపరి సిద్ధి 11 ఉ.9:58 కు
కరణం: బవ రా.1:54 కు తదుపరి బాలవ 11 మ.3:08 కు
రాహుకాలం: మ.03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ.8.53 - 9.40 కు, రా.11.13 - 12.01 కు
వర్జ్యం: రా.12.07 - 1.54 కు
అమృతకాలం: ఉ. 07.25 - 09.13 కు
సూర్యోదయం: ఉ. 6.31 కు
సూర్యాస్తమయం: సా. 6.21 కు
గురుబోధ:
🕉️సూర్యోదయం, సూర్యాస్తమయ సమయంలో ఎన్ని పనులు ఉన్నా ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్యుడ్ని దర్శించి నమస్కరించాలి. అర్ఘ్యం ఇవ్వాలి. ఉపనయనం అయిన వారు సంధ్యావందనం చేయాలి. ఉపనయనం కాని వారు లేదా స్త్రీ, పురుష భేదం లేకుండా అందరూ శ్రీ దేవీభాగవతములోని ఈ క్రింది శ్లోకముతో అర్ఘ్యం ఇవ్వవచ్చని శాస్త్రం.
యో దేవః సవితాఽస్మాకం ధియో ధర్మాది గోచరాః | ప్రేరయేత్ తస్య యత్ భర్గః తద్వరేణ్యం ఉపాస్మహే ||
🕉️ఫాల్గుణ మాసంలో ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె - ఈ మూడింటితో శివలింగాన్ని అభిషేకించిన వారికి తొంబది రోజుల్లో సంపదలు లభిస్తాయి ఫాల్గుణ మాసాలు సద్వినియోగం చేసుకొని దుఃఖవిముక్తిని పొందుదాము.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial